పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/600

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

704

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


వివరించవలసివస్తే చాలా పెరుఁగుతుంది. తెలియదని వప్పుకొనేటప్పుడు శాఖాచంక్రమణ మెందుకు; యెవరి కవిత్వమేనా లోకాన్ని ఆకర్షించడానికీ ఆకర్షించకపోవడానికీ, ఆలంకారిక గ్రంథాలు కారణం కావు. అవి లక్కీ లిక్కీ అని వాదించడానికే వుపకరిస్తాయి.

"నీయందమ్మది నాకు నచ్చదనెఁ దన్వీరత్న మొక్కర్తు"

బస్ చాలును, అంతతో విరమించవలసిందే కాని సాముద్రికాది శాస్త్రాలు యేకరు పెట్టి లక్ష్యే లక్షణసమన్వయం (చక్రధ్వజాదిరేఖలు వగయిరా) చేయడానికి ప్రయత్నించి ప్రయోజనం లేదు. అంతేకాదు. ఆపెను “నీకు సాముద్రికాది శాస్త్ర పరిచయంలేదు, కనక నా అందం నీకునచ్చిందికా"దని గాని, “నీ అందమూ నాకు నచ్చలేదు" అని కాని వాదానికి వుపక్రమించినా ప్రయోజనం లేదు. పూర్వకాలంలో నచ్చిన శ్రవణానందం యిప్పుడు నచ్చడంలేదని వ్రాస్తే నేను నచ్చఁజెప్పడానికి ప్రయత్నిస్తానేమో అనుకున్నారేమో? అట్టిప్రయత్నం నాదికాదు. (అందఱినిన్ దనియింప మమ్ము నిర్మించిన బ్రహ్మకేని దరమే; చూ.) ఏదేనా శబ్దాన్ని గూర్చో? అర్థాన్ని గూర్చో శంకవస్తే దాన్ని గూర్చి వ్యాకరణమో? కోశమో! మఱొకటో? ఆధారంగా చూపి సమర్ధించడానికి అవకాశం వుంటుందేమో కాని నీ కవిత్వం రసవిహీనం లేదా? అసహ్యం అంటే; సమర్ధించడానికి పూనుకోవడంకన్న వూరుకోవడమే వుత్తమం. దానిభారం పాఠకలోకానిదేగాని గ్రంథకర్తది కాదుగదా! కనక శ్రవణానందం రసాభాసమనే కారణంచేత హేయమైతే దానితోపాటు వాఙ్మయంలో నశించేవి యేవోకావు “భారతః పంచమోవేదః" కూడా నశించవలసే వున్నా యెఱిఁగీ యెఱగని శంకలను గొప్పఁజేసి వాదానికి దిగడం నాతలఁపు కాదు. కనక యిదివఱలో ప్రమాదపడి శ్రవణానందాన్ని పఠించినా అది దానితత్త్వాన్ని తెలియక చేసిన పొరఁబాటుగా భావించి యిఁకనేనా దాన్ని ముట్టకపోవడమే ఆదోషానికి నికారమని హెచ్చరిస్తాను. చక్కని విమర్శనాజ్ఞానమున్నచో శ్రవణానందం రసాభాసంకాదు. రసమున్నంతవఱకే గాని పిమ్మట రచన విరమించఁబడింది. అయినా దానిసమర్ధనం నాపనిగాదు. లోకం లోకం లోకం. ఇంతేకాదు- (1) మనుచరిత్ర (2) వైజయంతీవిలాసం వగైరాలు చాలావున్నాయి. వీటి నన్నిటినీ పరిత్యజించవలసిందే అని కూడా సలహాయిస్తాను. వొకమాట వ్రాయడం మఱిచాను. “మాదాకవళ" కవిత్వం నాకు నచ్చలేదన్న హేతువుచే– “త్వం అంటే త్వం” అనడం లోకరివాజు కనక యీలా అనవలసివచ్చిందేమో అని లోకులు అనుమానించడానికి అవకాశంమాత్రం లేకపోలేదు, కాని దైవముఖం చూచి వ్రాసేవ్రాఁతల్లో ఆత్మవంచన వుండదు కనక నిజంగానే నచ్చలేదనిన్నీ నచ్చకపోయినా యాథాలాభాలుగా చదువుచూ వచ్చారనిన్నీ అంతేకాదు ఆనందిస్తూ వచ్చారనిన్నీ నేను విశ్వసిస్తాను. నాకుమాత్రం విన్న