పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

64

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


వుండడంచేత నిద్రాభంగం వగయిరాలు కలగడంలేదు. కొందఱు బోనులు పెట్టివీట్లని పట్టించి తగ్గించాలని ప్రయత్నంచేసి విఫలమనోరథులు కావడంనేను స్వయంగానే యెటింగివుండడంచేత ఆ ప్రయత్నంయొప్పుడూ చేయలేదు. ప్లేగువ్యాధి గోదావరిజిల్లాకు భగవదనుగ్రహంవల్ల యింతవఱకు సోఁకకపోC బట్టిగాని సోంకే యెడల వీటి బాధ గ్రామపారిశుద్ధ్యంకొఱకేర్పడ్డ సంఘం వారు యేదేనా వుపాయంచేసి తగ్గించే వారేమో? వీట్ల అభివృద్ధికి పరిమితే కనపడడంలేదు. పంచాంగాలల్లో వుండే వృద్ధి క్షయాలు సరిపోవడంలేదు. క్రమంగా " మాయింట్లో మాకోసంనిలవచేసుకున్న ధాన్యంలో భాగస్వాములుగా యివియేర్పడ్డాయి. వీట్ల బాధ పడలేక యెంతో కట్టుదిట్టంగా వేలే వకగాదె కట్టిస్తే కట్టించినన్నాళ్లేనా పట్టలేదు. దాన్ని కుచేలుని వస్త్రంకన్నా మిన్నగా జల్లెడతూట్లతో చిత్రించి వదిలిపెట్టాయి. యిప్పడు వీట్లల్లో పెద్దజాతి పందికొక్కులు కిటికీలను పూర్తిగా చిత్రికపట్టు పడుతూవున్నాయి. యిదంతా మనఅహింసా పరత్వానికి ఫలితం అనుకోవలసిందేకాని మతేమనుకోవలసింది? ఆమధ్య యీబాధ పడలేక వకవూల్లో వకగృహస్టు మంచిచెడ్డ లెటింగినవాండే యింతపాషాణం తెచ్చి కోడలికో కూCతురికో యిద్దటికో యిచ్చేటప్పటికి దాన్ని పెరుగుఅన్నంలో కలిపి వకచోట పెట్టేటప్పటికి ఆపందికొక్కులుతిని గోండ్రిసూపరమపదించే ప్రయత్నంలో వుండడం ఆయింట్లోనేవుండే వకముసలివృద్దుచూచి యిదేమిటని ప్రశ్నించేటప్పటికి గతంలో జరిగిన విషయం చెప్పేశారు ఆయజమానురాండ్రు. అదివిని ఆయన ‘పిల్లాజెల్లాతో కాపురంచేసేవాళ్లం మనం యీలాటి పని చేయవచ్చునా?” అని మందలిస్తేవాళ్లు - "దుష్టజంతువును చంపితే పాపంలేదని జవాబుచెప్పారంట! యివి పాములూ తేళూ వగయిరాల వలె దుష్టజంతువులు కావుగదా! అంటే? “పాములుమాత్రం అన్నీ దుష్టజంతువులా? కొన్ని అంటేబురదపాములు నీరుకట్టెలు వగయిరాలకు విషంవుండనేవుండదు: ఆకారసామ్యాన్నిబట్టేవాట్లని చూచికూడా భయపడుతూవుంటారు. ఆలాగే యీఎలకలలోకొన్ని విషజంతువులుగా వుండకపోయినా కొన్ని విషజంతువులున్నూ వుండడం సుప్రసిద్ధమే. అవికటిస్తే వెట్టికుక్కవెట్టినక్కలతోపాటు చిక్కుతేవడం అందఱూయెఱిఁగిందే వెట్టి కుక్కలకూ వెట్టినక్కలకూ అంటే వీట్లకాట్లకు తరుణంలో అయితే నీలగిరిలో అవ్యాహతంగా కుదిర్చే వైద్యశాల రాజకీయమైనది వకటివున్నట్టు వినబడుతూంది. గాని యొులకకాటుకు అట్టి ఆధారంకూడా వున్నట్టులే" దంటూ ఆ యజమానురాండ్రు జవాబు చెప్పేటప్పటికి ఆ ముసలాయన జవాబు చెప్పలేకవోహో వీళ్లుధర్మసూక్ష్మాలు యెటింగినవాళ్లుకారు. యెప్పడో మనకి కూడా వీళ్లీలాటి వుపాయం చేస్తారు. యేమంటే? అవి వృథాగా చావల్ ఖరాబు చేసినట్టేనేనున్నూ చేస్తూ వున్నట్టు వీళ్లకు తోస్తే గతేమి? టనిచెప్పి ఆస్థలాన్నుంచి మటోస్థలానికి మకాంమార్చుకొన్నట్టు i

  • Taجي-o