పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/599

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

703“సహృదయాః ప్రమాణమ్”

అనే విషయంలో మనం యెన్ని యితర ప్రమాణాలు చూపి వివదించినా ప్రయోజనం లేదు. ఆనందవర్ధనాచార్యులవారు వారిజీవితకాలంలోనే అనుకుందాం యీ "అమ్మా! మాదాకవళం" గేయం బయలుదేరితే దానికి కవిత్వవాఙ్మయంలో వారి విమర్శనలో యేలాటి సీటు వుండేదో? నేను వివరించనక్కఱలేదు. ఈమహాభాగ్యం నిన్న నేఁడు పొడచూపింది. యీ రోజుల్లో యింతకంటే కూడా కొత్తరకం రచనలు బయలుదేరుతూ వున్నాయి, మచ్చు చూపుతాను. - -

గుడగుడ - చెళ్‌చెళ్
గుడగుడ - చెళ్‌చెళ్
గడగడ - పిళ్‌పిళ్
గడగడ - పిళ్‌పిళ్
చరచర - కొడ్తాన్ కొడ్తాన్
చరచర - తిడ్తాన్ తిడ్తాన్,
విరవిర - ఉంటాన్, తింటాన్,
విరవిర - వింటాన్, కంటాన్,

చాలును - యీమాదిరి ఖండకావ్యసంపుటం నొకటి అభిప్రాయార్థం వచ్చింది. అది నాకు అర్ధమే కావడంలేదు. యేమి అభిప్రాయం యిచ్చేది? దీన్ని పాశ్చాత్యులవెన్నవలెనే కొన్నాళ్లు అలవాటు చేసుకోవాలి కాఁబోలునని సమాధానపడ్డాను. లోఁగడ చర్చింపఁబడ్డ “మాదాకవళం” అనేగేయం అర్థమవుతూ వుంది. యిదో? నమ్మండి, నమ్మకపోండి (నమ్మిన నమ్మకున్న నది నావశమూ?) శుద్ధ అగమ్యగోచరం, అయోమయం. నా కేమీ అవగతం కానే లేదు. దాన్ని ఆలా వుంచుదాం "మాదాకవళం' గేయం నేను యెంత ప్రయత్నించినా నాకు నచ్చలేదు. నాకు నచ్చకపోయినంతమాత్రంలో యితరుల కెందఱికో అది నచ్చడం తటస్థిస్తే అది కవిత్వం కాకపోదు, కనక దానికోసం ధ్వన్యాలోకం యావత్తూ గాని, కొంతగాని యేకరువు పెట్టి ప్రయోజనం లేదు. ఉదాహరించిన శ్లోకమేనా బాగా పరిశీలిస్తే ప్రస్తుతానికి అనుకూలించేది కాదు. అందులో వున్న ప్రబంధశబ్దం బాధక మవుతుంది. దాన్ని