పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/596

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

700

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

“కుర్వీత బుధసోమయోః" భవతు. ఆయీ మాదిరి కవిత్వాలు కొందఱు వ్రాస్తూన్నారు కనక లక్ష్యములు సిద్ధమైనాయి. వీట్లకు తగిన లక్షణగ్రంథాలు యిఁక పుట్టవలసి వుంది. కొద్ది రోజుల్లో ఆతరవాయి తీరుతుంది. అప్పుడు వాట్లద్వారా వీట్లని సమర్థించడం యుక్తం, అంతేకాని యిప్పటి “మాదాకవళ" కవిత్వానికి ఆ మహాకావ్యాల నిమిత్తం పుట్టిన ఆలక్షణా లేం పనిచేస్తాయి? (కాల్లో ముల్లుగుచ్చుకుంటే గునప మేంపనిచేస్తుంది?) వాట్లదృష్ట్యా యీరచనలన్నీ "పూర్వత్రాల౽ సిద్ధాలు" కదా! వీట్లవంక అవి చూడనే చూడవు. చూస్తేనో? ముందుగానే అపశబ్దాలు కనపడి యేవగించుకుంటాయని వ్రాయనక్కఱలేదు. యిది (ప్రస్తుత గేయం) కవిత్వంలో జమకట్టఁబడేయెడల-

1. ఓ యేవయ్యో? కాపు
   మాయింటి కే ల్రావు
   మీయింటి కే ల్రానే నా
   సేతు లేం నేదు (లస్య నః)

2. అచ్చావు నెయ్యంటివే?... ... స్తివే. వగయిరాలన్నీ కవిత్వాలే కావలసి వస్తుంది. యిక్కడ వొకమాట వ్రాస్తాను. యీ వుదాహరించిన లొల్లాయి పదాలలో కొంచెం రసమయితే వుందిగాని, అది కొంత దోషజుష్టమే కనక పండితు లాదరించేదికాదు. యీమాదిరి లొల్లాయిపదాల రచనకు ప్రకృతగేయకర్తగారు (చక్కనిసాహిత్యం కలవా రగుటచే) తగరు. చదువుకొన్న చదువుకు తగిన రచన చేసి దానిలో పేరుప్రతిష్టలు సంపాదించవలసింది. యిదేమో సుళువైన వుపాయం అనుకున్నారు. అంతవఱకు అంగీకారమే కాని యీ రచనమొఖం చూడడానికే యేవగించుకొనే లక్షణకర్తల వాక్యాలు వుటంకించి సమర్థించే ప్రయత్నం శోచ్యం. నేను లోఁగడ యెంకిపాటలను గూర్చి వ్రాసిన వ్యాసాలలో వీట్లవిషయం విపులంగా చర్చించాను. వెనుకటి లక్షణాలుగాని, వాట్లని మన్నించే చేదస్తప్పండితులుగాని, కవులుగాని యీరచనలకు ఆమోదించరు. కనక ఆ లాక్షణికోక్తులు వీట్ల సమర్థనానికి వినియోగించవద్దనే యెంత వ్రాసినా నేను వ్రాసేది. అయితే గేయకర్తగారు యెందుకు వాట్లని వుదాహరించారంటే? వినండి. "కోశవా నాచార్యః” అని పాఠకలోకానికి తెల్పడానికిన్నీ అంతేకాదు వెం. శా. కి ఆ యీగ్రంథాలు యేవీ తెలియవు, అనికూడా లోకానికి తెలియఁజేయడానికిన్నీ అవుతుంది. ఈ అంశం ఆయనవ్యాసంలో కొన్ని వాక్యాలు సూచిస్తాయి, అయితే నిజానికి కట్టుపడాలి. నేను ఆగ్రంథాలు గురుముఖతః చదివి ప్యాసైన “శిరోమణిని" కాను. యిఁక యేతరగతిలో చేరతానంటే? యెందుకూ పనికిరాని “ఉరోమణి" తరగతిలో చేరితే చేరతాను. ఆనందవర్ధనాచార్యులవారి వాక్యాలు, యీలొల్లాయి పదాలను