పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/592

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

696

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


“శిరచ్ఛేదసమయంలో కుండలాలనుగూర్చి విచారించినట్టు" అసలే పనికి రాదనే గేయవిషయంలో తాళాన్ని గూర్చిన్నీ రాగాన్ని గూర్చిన్నీ విచారించడం బొత్తిగా అనుచితం. ఇదిన్నీకాక, పుట్టి బుద్దెఱిఁగింది మొదలు పరిశ్రమ చేసిన కవిత్వంలోనే "నీకేమీ తెలియదు" అనడానికి సంశయింపని గేయకర్త కచుంబితమైన గానవిషయంలో “తోసిరా జనడానికి" సంశయమంటూ వుంటుందా? అందుచేత ఆ విషయంలో కలం నడిపేది లేదు.

“శ్లో. స్వాధీనో రసనాంచలః పరిచితా శబ్దాఃకియంతః క్వచిత్
     క్షోణీంద్రో న నియామకః పరిషదశ్శాంతా స్స్వతంత్రం జగత్
     తద్యూయం కవయో వయం వయమితి ప్రస్తావ నాహుంకృతి
     స్వచ్ఛందం ప్రతిసద్మ గర్ణత వయం మౌనవ్రతా౽౽లంబినః"
 
                       సహృదయాః ప్రమాణమ్.

★ ★ ★