పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/59

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈతి బాధలు

63


చెపుతూవుంటే తెలిసినా తెలియకపోయినా విని సంతోషించడానికి బదులు ఆ సమీప గృహంలోనే నివాసంగా వుండే పోలీసుశాఖాధికారి ఆ వేదఘనోష తనకు నిద్రాభంగానిక్కారణ మయిం దంటూ “లీగల్గా నిషేధించడం నేను బాగా యెఱుఁగుదును. అత్యాసన్నులు రాజులుగా వుంటే వుండే చిక్కు కొంచెంమాత్రం సూచించాను. దీన్నిబట్టి యింకా వుండే చిక్కులను చదువరులు వూహించుకోలేకపోరు. పూర్వరాజుల ప్రభుత్వాన్ని కవులు వర్ణించేటప్పుడు నీరీతి’ పదంతో వర్ణించడం అందఱూయెఱిఁగిందే. యీతిబాధారహితంగా ప్రభుత్వం వుందంటే ప్రజలుమిక్కిలీ సుఖిస్తూవున్నారన్నమాటే. అయితే అతివర్షాదిబాధలు దైవికాలు గదా, వాటిని రాజు తొలంగించడం యేలా గంటూ సూలదృష్టులు శంకిస్తారేమో కాని అందుకు శాంతిక్రియలు చేయించినట్లు గ్రంథ దృష్టాంతాలుకొన్ని కనపడతాయి. యింక మిగిలిందల్లా మూషకబాధ. పందికొక్కులుకూడా వీట్లలోనే అంతర్భావంగా చూచుకోవాలి. యిప్పడేమో వీట్లవల్ల ప్లేగుజాడ్యం వృద్ధిచెంది ప్రజానాశకంగా పరిణమించడంచేత ఆయాప్రదేశాలల్లో వీట్లని మారణంచేయడం జరుగుతూ వుంది. వెనుకటి కాలంలో వీట్ల బాధ ఏలా నివారించు కొనేవారో తెలియదు. మనుష్యులలో కలిసి మెలిసి తిరిగే జంతువులలో యింత కొంటె జంతువులేనేలేదని నాకుతోస్తుంది. ఆహారానికిపాట్లు పడడం ప్రతిప్రాణికిన్నీ తప్ప దనుకుందామంటే నిర్ణేతుకంగా చక్కనిపుస్తకాలు కొటికి పాడుచేస్తుందిగదా! యీ పనికిమాలిన జంతువు. అది కొంటెతన మనుకుందామా! లేక యేదో కొఱుకుతూవుంటేనేకాని దానికి కాలక్షేపం కాదనుకుందామా! యిందులో పందికొక్కు జాతివుందా? దానిశక్తి మటీ అద్భుతం. దాని కోఱలకల్లాలొంగనిది యినుమున్నూ గట్టిజాతి రాయిన్నీ కనపడుతుంది. కఱ్ఱజాతిలో శ్రేష్టమయిందిగదా? అని కొంచెం పచ్చగావున్న సంసారులు కిటికీలూ ద్వారబంధాలు తలుపులూ టేఁకువి చేయించుకొంటారు. యీ పందికొక్కులు ఆజాతికఱ్ఱను అప్పడంకన్నా తేలికగా కొటికి తనకు కావలసినంతద్వారాన్ని కల్పించుకుంటుంది. మాగ్రామంలో వున్నయిళ్లల్లో మాయిల్లుచాలా కట్టుదిట్టమయిందని అంతా అనుకుంటారు. యెలకలు మా యింట్లోవున్నన్ని యొక్కడాలేవు. వాట్లనియింట్లో ప్రవేశించకుండా కట్టుదిట్టంచేయడానికి వుపాయంలేనేలేదు. వాట్లకుసమృద్ధిగా తినడానికి ధాన్యం వుండడంచేత అవి మాయింట్లోచేస్తూవున్న హంగామాకుపరిమితే కనపడడంలేదు. కిందనుంచి కిటికీలోకి యెగరడానికి మధ్యమకాంగా ఆసమీపంలో మడత మంచంమీంద పడుక్కున్న నన్నే యేర్పఱుచుకున్నాయి. పుస్తకాల బీరువాలల్లో ప్రతిరోజున్నూ వీట్లకుసంబంధించిన పురుళ్లు జరుగుతూనే వుంటాయి. యింటిచూరులనిండా వీట్లకలకలధ్వనే వినపడుతుంది. సరంబీమీఁద వీట్ల చెడుగుడియాటల ధ్వని కొత్తవాళ్లకు కొంత భయంకరంగాకూడా కనపడుతుంది. మాకు జతపాటుగా \