పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/589

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కవితా విప్లవం - 2

693


వాడేమాటలూ వూరికేపోవు. వారి ఆక్షేపణలూ వూరికే పోవని నేను తలుస్తాను. ఫలితార్థం "యజ్ఞయాగాలు" నిర్దుష్టమని తేలింది. యింకా “ఋతం వద, సత్యం వద” వగయిరాలు యీలాటి వున్నాయి. యివన్నీ వేద వ్యాఖ్యానా లెఱిఁగినవారు వ్యాఖ్యానించతగ్గవి. అర్హత చూచుకోకుండా, నేను దీన్ని గూర్చి వ్రాస్తే పండితలోకం విచారిస్తుంది. "ఋత సత్యాలు, కవిపండితులు, దుఃఖశోకాలు” వగయిరాలలో యత్కించిద్భేదం వుందని మహాకవుల ప్రయోగాలు చెపుతూన్నాయి. యివి పునరుక్తాభాసాలుగాని, పునరుక్తాలుకావు. వ్యాఖ్యాత లీవిషయం వ్యాఖ్యానిస్తూ వచ్చారు. ఆ యీపదా లేవీ పునరుక్తులు కావనేది వక్తవ్యాంశం. ప్రస్తుతం "యజ్ఞయాగాలు" అన్నచోట యిదివఱలో చూపినదే సహృదయసమ్మతమైన సమాధానం. దాన్ని వొప్పుకొనేది లేదనే వైతండికులకు యింకోటి వుంది గొడ్డలిపెట్టు సమాధానం. ఇది ఆక్షేపకుల ప్రయోగాన్ని కూడా సాధిస్తుంది. యజ్ఞపదానికి యజ్ఞాలు (పశువిశసనం వగయిరాలతో సంబంధించినవి) చెప్పుకోండి, దానికి పర్యాయపదంగా కనపడుతూవున్న యాగపదానికి దానము అని అర్థం చెపితే మీరు చేసేదేమిటి? దానమనే అర్ధం యేలా వస్తుంది? అని ప్రశ్నిస్తారు. సరే “యజదేవపూజా సంగతి కరణ దానేషు” అనే ధాతుపాఠం చిత్తగించండి, అంటే సరిపోతుందా? ఉఁ, హుఁ, సరిపోదు. సరిపోదేమి? (సర్వం ధాతుమహ) ప్రయోగం కావాలంటారా? అన్నిటికీ ప్రయోగాలుంటాయూ.

“ణిసి, ధాత్వర్థ మనుగ్రహింపఁ గదవే" అన్నాఁడు శ్రీనాథుఁడు. దీనికి ప్రయోగాంతరం నన్నయాదులది వుందా? ఆమధ్య నేను “బుక్కించు" అని వొకచోట ప్రయోగించాను. ఇది యేదో భాషాంతరంగా భావించి, పూర్వపక్షం వచ్చింది-కాదు సంస్కృతం. బుక్క భషణే, భషణం శ్వరవః (కుక్కకూఁత) అని తెల్పడం జరిగింది. ఓహో ప్రమాదపడి ప్రశ్నించాంగదా అని, పశ్చాత్తపించి కర్ణాటకలహంగా “ప్రయోగం చూపవలసింది” అని మళ్లా ప్రశ్న వచ్చింది. దీనికి ప్రయోగం యెందుకు? ఈ కుక్కకూఁత యేకవికి అవసర మవుతుం దని అడిగేవారి తాత్పర్యం. వారికి “శ్లో. నసశబ్దో... జాయతే యన్న కావ్యాంగ మహోభారో గురుః కవేః” యీశ్లోకం వుందనికూడా తెలుసునో? లేదో, యిక్కడ అవాంతరంగా వొకమాట వ్రాసి మఱీ ప్రస్తుతం వ్రాస్తాను. “మాదాకవళం' గేయకర్తగారు, పైశ్లోకంలోని "కావ్యాంగం" అనే పదార్ధాన్ని బాగా గమనించాలి. ప్రస్తుతం అందుకుంటాను - పండితరాయలు “బుక్క నైర్ధిక్కరోతి" అని ప్రయోగించాఁడు. సమయానికి స్ఫురణకు తగిలిందే అనుకోండి. తగలకపోతేనో? ఆ "బుక్కించు" తప్పనుకోవలసిందేనా? మే మల్లా యీలాటి శబ్దాలవిషయంలో కొంత సాహసం చూపుతూవచ్చాం, కాదు కాదు, సాహసం చూపినట్లు కొందఱు అనుకుంటారు. యిది నిఘంటులో వుందాఅని అడిగితే, చెప్పే