పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/588

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

692

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


మఱికొందఱు యువకవులుకూడా యీలాటిగేయాలకు కాకపోయినా యేదో కొత్తపుంతలో రచించే రచనలకు నన్ను లేదా మమ్ము మార్గదర్శకులనుగా వ్రాయడం వుంది. కాని, ఆయీ ఆపాదనకు వారువారు యేవిధమైన లక్ష్యములున్నూ చూపినట్టు లేదు. ఉపనిషత్తులలో వుండే రహస్యం బయటికి తీసి ప్రకటించిన మతకర్తలు లేశమూ కూడా కొత్తవిషయం బోధించనప్పటికీ, వారివారి పేళ్లతో ఆ మతాలు పేర్కొంటూవుంటారు. అప్పకవి కొన్నియతులు కొత్తవి కనిపెట్టినట్టు వ్రాసుకున్నాఁడు, మేముకూడా పూర్వకవులు వెళ్లిన మార్గాలుకొన్ని వుంటే, వాట్లనుబట్టి కొన్ని యమకాది చేదస్తాలు వదలుకుందామని అనుకొని, రచన సాగించుకుంటూ వచ్చాము. అంతేకాదు, "క్షమాపణ" లోనైన నిక్షేపంవంటి శబ్దాలు వ్యవహార భాషలో వాడుకుంటూ వున్నారన్నంతమాత్రంచేత అవి "నింద్య గ్రామ్యాలు" అని కొందఱు అపవదిస్తే "కావు మహారాజా! వాట్ల సాధుత్వం ఇట్టిది" అని వాచస్పత్యాదికం వెదికి చూపుతూ వచ్చాం. ఆలా చూపినతర్వాత కూడా యింకా "క్షమార్పణ" అని వాడుకునేవారు లేకపోలేదు. శాస్త్రం వుంది. ఋషులవే కాక, పండితరాయాదుల ప్రయోగాలున్నాయి. వాచస్పత్యం వుంది. యిన్నివున్నా, వ్యావహారికంలో వాడడం వల్లనే అది గ్రామ్యమవుతుందా? క్షమార్పణగా సవరించి వాడడమనేది గోదావరికి "గోధావరి" అని వాడడంవంటిదేనా? తత్తథాస్తామ్.

(1) లవ లేశములు, (2) యజ్ఞ యాగములు. ఇవన్నీ శిష్ణులైన మహావిద్వాంసులు వాడతారు. మిక్కిలీ స్వల్పము అనే అర్థం వివక్షితమైనప్పుడు వొక్క"లవ" పదం చాలదని, లేశపదం చేరుస్తారు. లవంలో కూడా లవమని దాని తాత్పర్యం. ఆ శిష్టులేనా యిది స్వంతంగా వాడిందికాదు. “కుర్వంతి కామసుఖలేశలవాయ" అని శ్రీమద్భాగవతం. “లేశస్యా౽పి అణ్వంశాయ" అని వ్యాఖ్యానం. ఇవేవీ చూడక, ఆక్షేపిస్తారు. యేమనుకొనేది? ఇఁక "యజ్ఞయాగాలు" అనేది - యజ్ఞపదానికి, బ్రహ్మయజ్ఞం (నియతంగా ప్రతిరోజూ వైదికులు కొన్ని పనసలు యేకరువుపెట్టడం) అర్థం, అనిన్నీ - యాగపదానికో? "అగ్నీషోమీయం పశుమాలభేత “గామాలభేత” వగయిరా శ్రుతి చోదితమైన పెద్దపెద్ద యాగాలు అర్ధమనిన్నీ సమన్వయించుకుంటే సరిపోతుంది. దీని కితరులప్రయోగాలు వెదకనక్కఱలేదు. దీన్ని ఆక్షేపించినవారే వొకచోట ప్రయోగించి వున్నారని వొకవిజ్ఞుఁడు నాపేర వ్రాస్తూ "ఇదేమిటండీ? 'ఈ యజ్ఞయాగాలు' ఆయన ప్రయోగించుకొన్నప్పుడు శుద్ధమై, మీరు ప్రయోగిస్తే శుద్ధం కాకపోయిం"దంటూ ప్రశ్నించడం జరిగింది. దానికి నేనేమీ జవాబు చెప్పలేకపోయాను. ఆక్షేపకులు నాలాగు వూరుకోరనిన్నీ యేదోసమాధానం చెపుతారనిన్నీ నే ననుకుంటాను. శిష్టమహావిద్వాంసులు అనఁగా వేదశ్రౌతాలు వచ్చినవారు