పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/585

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కవితా విప్లవం - 1

689


సమర్థించుకోవడానికి వీలిస్తుంది. పూర్వ కవిత్వాల కేనా మున్ముందుగానే లక్షణం పుట్టివుండదు. లక్ష్యం పుట్టినపిమ్మటే లక్షణం పుట్టి వుంటుందన్నదే యుక్తిసహమైనమాట. యతిప్రాసలు వదలుకోవడానికి అభ్యనుజ్ఞ యే లాక్షణికులూ యివ్వనక్కఱలేదు. సంస్కృత కవిత్వమే మార్గప్రదర్శక మనుకుంటే సరిపోతుంది. అయినా యింకా వాట్లని వదులుకున్నట్టు లేదు గదా? అందుచేత సర్వమూ మార్పు చెందుతూవున్న యీ నూతన ప్రపంచానికి నూతన కవిత్వం కూడా ఆవశ్యకమే. యిప్పుడిప్పుడు నాకు కూడా తోస్తూనే వుంది. దీనికి నేనే మార్గప్రదర్శకుణ్ణని కొందఱు వ్రాస్తున్నారు. ఆమార్గప్రదర్శకత్వం యెంతవఱకు సత్యమో, యెంతవఱకు కాదో ఆయీ నా వ్యాసంవల్ల లోకం గ్రహించుఁగాక.

★ ★ ★