పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

62

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


నంతల్లో దేశములో వున్న చేలన్నీ ‘అయ్యవార్లంగారి నట్టిళ్ల క్రింద మాటిపోయాయి. కాని వీట్ల జీవితమంతా కలిపితే సుమారు 24 గంటల కాలం కంటే యొక్కువ వున్నట్టులేదు. యిది యెందుకు పుట్టవలసి వచ్చిందో? అంతల్లోనే యింతటి లోకాపకారానికి హేతుభూతాలై వెంటనే నశించడాని కారణమేమో? అని ప్రశ్నవేసుకుంటే మాత్రం జవాబు సుఖసుఖాల తేలదు. యొక్కువ పరిశీలనతో ఆలోచించిచూస్తే మనుష్య జీవితానికి మాత్రం యింతకన్నప్రయోజన మేం కనబడుతుంది? అందులో స్వోదర పోషణకోసం పరాపకారమే నిత్యవ్రతంగా ప్రవర్తించే వాళ్ల జీవితాన్ని గుఱించి వేటే చెప్పనే అక్కఱలేదు, అందులోనున్నూ పూర్వజన్మకృత సుకృతంవల్ల యేదోరాజకీయాధికారం పట్టి, ఆ అధికారాన్ని లంచగొండితనం కింద వినియోగపఱిచే పుణ్యజనులు యీ మిడతల జీవితంతో తమజీవితాన్ని పోల్చి చూచుకుంటే వెంటనే ఆదుర్వృత్తి వదలకపోయినా కొంత పశ్చాత్తాపమేనా కలిగితీరుతుం దనుకుంటాను. వీట్లని యిందుకోసమే భగవంతుడు లోకానికి పంపివుంటాండేమో? మిడతలదరీడు 25 యేళ్లనాడు చూడడమైంది. రామదండు సుమారు 50 ఏళ్లకు పూర్వం చూచాను. అది యొక్కడ పుట్టిందో తెలియదు. వొకవూరునుంచి యింకోవూరు రావడమున్నూ, వచ్చేటప్పడు తోవపక్కనువుండే చెటూ చేమలూ విఱిచి పాడుచేయడమున్నూ చూస్తే రామదండు అంటే కోంతులు కనక ఆపేరు సార్థకపఱచడంగా కనపడింది. ఆయాగ్రామాల్లో సంతర్పణలూ సమారాధనలూ అనుభవించడం, ఆవూరివాళ్లద్వారా యింకోవూరు సమీపంలో వున్నది వెడుతూ వుండడం యిదే ప్రకారం "గతానుగతికంగా కొన్ని మాసాలు జరిగింది. దీనిలో వక్క విశేషం మాత్రం వుంది. శ్రీరామనామస్మరణ. యిది అంటే యీ దండు చివరకు యేవూల్లో అంతరించిందో మాత్రం తెలియలేదు. యొక్కడపుట్టిందో? అంతకుముందే తెలియదు. దండుశబ్దసామ్యం వుండడంచేత దీన్ని యిక్కడ వుటంకించవలసివచ్చిందే కాని అంతో యింతో వీథి పక్కని వుండే చెట్లకొమ్మలకు తప్ప యితర సస్యాలకు మిడతల దండువల్ల కలిగినట్టు యీ దండువల్ల లేశమున్నూ నష్టం కలిగినట్టు లేదు. యింక "అత్యాసన్నాశ్చ రాజానః" అంటే? మిక్కిలీ సమీపంలో, అనంగా తన యింటికి దగ్గిఱగా వుండే రాజులు లేదా? రాజానుగ్రహపాత్రులైన రాజపురుషులు. వీరు కూడా యీతిబాధలలోకే చేరతారా? అంటే? వినండి. त्७० చిన్నతనంలో పదేళ్లవయస్సుపిమ్మట సుమారు వక పుష్కరకాలం ఫ్రెంచిటవును యానంలోనే వెళ్లింది. ఆ వూల్లో కీl శే శ్రీ మన్యం మహాలక్ష్మమ్మ జమీందారురాలు నివాసంగా వుండడంవల్ల యెన్నో వైదికానికి సంబంధించిన పుణ్యకార్యాలు వారి మేడకు ఎదురుగా వుండే సత్రంలో తఱుచు జరుగుతూ వుండేవి, వేదంలో ప్రసిద్దులైనవారు వచ్చి నవరాత్రోత్సవాలల్లో శ్రావ్యంగా స్వస్తివగైరాలు పరస్పర గాత్రాలుకల్పి ఉచ్చైస్వరంగా - -- །---- o* i--