పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/579

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత భారతి

583


భారత వాఙ్మయ సముద్రమును యేకొంచెమో (యీదితే) యీదగలుగుతానేమో కాని తుదముట్టా (దరియంగన్-చూ) యేలాగా యీదగలవాణ్ణి కాను. అని స్పష్టంగా భావ్యనర్థాన్ని (అభిధచేతనే లక్షణ వగయిరా లక్కఱలేదు) భగవంతుఁడు ఆయనచేతనే పలికించి నట్టయిందో? లేదో? సహృదయులు పరిశీలింతురు గాక. యీ అపార్థం కవికి సమ్మతమని యెంత పిచ్చివాడూ అనడు. సమ్మతమే అయితే అది అపార్ధమెందుకవుతుంది? యథార్థమే. అది కేవలం దైవప్రేరితం. ఇక్కడ చెడ్డకు సూచక మీవిధంగా అయింది. గాని వేఱొక్కచోట మంచికిన్నీ యిట్టి సూచకాలు (నేత్ర స్పందనాలు) కలుగుతవి. “అధవా భవితవ్యానాం ద్వారాణి భవంతి సర్వత్ర" అనలేదా? కాళిదాసు యీలాటి సందర్భాలలో- "తత్రభవితవ్యతా బలవతీ” అంటారే కాని, గ్రంథకర్తలు అన్యథాగా వ్యాకరింపరు. ప్రధానమైన యీదనుఅనేది యీశత్రోవలోకి యెప్పుడయితే సమన్వితమయిందో! అప్పుడు “ముట్టను ఎన్నను" అనేవిన్నీ ఈ త్రోవనే సమన్వితములై ఆ అపార్థాన్నే బలపరుస్తాయని వ్రాయనక్కఱలేదు. యిక్కడల్లా ముఖ్యంగా జ్ఞాపక ముంచుకోతగ్గది యీ అపార్థం దైవప్రేరితమే కాని కవికి అభిప్రేతం కాదు. అనేదియ్యేవే. “అభిప్రేతమే" అని యెవరేనా ఆపాదిస్తేనో అది ఐహికానికే కాక పారమార్థికానిక్కూడా చాలా హానికరమని వేఱే వ్రాయనక్కఱలేదు. యీ సంగతి యెఱిగో, యెఱక్కో వొకానొకరు (యః కశ్చిత్) వృథాగా ద్వేష బుద్ధితో నేనేదో- "చ. అమలిన తారకా సముదయమ్ముల నెన్నను" అనే పద్యంలో అసలు అనాదిసిద్ధమైన పాఠంగా వుండే "భారత వాహినీ సముద్రము" అనే పాఠాన్ని ఆదేశించినట్టు అపలపించడమే కాక, కొన్ని దూషణోక్తులు కూడా వ్యయపెట్టిన వ్రాత వొకటి- ఆంధ్రవాణిలో కనపడింది. నేను గోణం కట్టింది మొదలు కొన్ని భారత ప్రతులు చూచివున్నాను. గాని, నాకు ప్రతిపక్షి అపలపించే వాహినీ పాఠం వుపలబ్ధం కాలేదు. సర్వత్రా “భారత భారతీ” అనే పాఠమే వుపలబ్ధమయింది. అదిన్నీ కాక భారత వాహినీ పాఠానికి వ్యాఖ్య వ్రాస్తూ, ప్రతిపక్షి బహువ్రీహి సమాస సూచకంగా, భరత వీరచరితలనెడు వాహినులు కల – అనే విగ్రహానికి స్ఫోరకమైన అక్షరాలు (భరతవీర చరితలనెడు నదీ ప్రవాహములు కల, చూ) లిఖించివున్నాఁడు. ఆ పక్షంలో బహువ్రీహి సమాసానికి రాదగిన చిహ్నం హ్రస్వమో? లేక కప్పో? రావలసివస్తుంది. ఆపక్షంలో పరినిష్టిత రూపం - భారత వాహినీకః లేదా? “భారత వాహినిః" అని కావలసివస్తుంది. యిందులో దేనికంగీకరించినప్పటికీ ఛందో భంగం దుర్వారం. వాహినీపాఠానికి చెప్పే అర్థంకూడా, అంత వీలుగా లేదు. అట్టి అర్థం కవి వివక్షించవలసిన ఆవశ్యకత కూడా కన్పడదు-

భారత వాఙ్మయమును సముద్రంగా రూపిస్తే చాలు. చాలినాసరే తృప్తిపడక వాహినీపాఠాన్ని కల్పిస్తామంటే వున్న విప్రతిపత్తి సూచించాను. యిఁక నిప్పుడు వాహినీ