పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/578

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

582భారత భారతి

"భారత భారతి" అనే యీ ప్రయోగం ఆదిపర్వంలో వుంది. దీని కర్థం సరియైనది - భారత = భారతం (గ్రంథం) యొక్క భారతి = వాణి. అనగా? భారత వాఙ్మయమన్నమాట. దీన్ని సముద్రంగా రూపించి నన్నయ్యగారు దీన్ని దరిముట్టేటట్టు యీఁదడానికి బ్రహ్మకేనా శక్యం కాదన్నారు. “భారత భారతీ సముద్రము దరియంగ నీదను విధాతృనకైనను నేరబోలునే" చూ. ఆ యీ సందర్భం నేను అయిదాఱేళ్లకు పూర్వం యేదో సూత్రప్రాయంగా త్రిలింగ పత్రికలో వ్రాసి వున్నాను. భారత రచన అరణ్య పర్వంలో కొంతతోటే సమాప్తం కావడానికి ఆపర్వంలోనే శరదృతు వర్ణనలో వున్న"ఉ. శారదరాత్రు లుజ్జ్వల. . . రుచిపూరము లంబర పూరితమ్ములై" అనేవి కారణంగా కవిపరంపర చెప్పుకుంటారు. ఆ యీ సందర్భానికి అరణ్యపర్వందాకా వెళ్లనక్కఱలేదు. ఆదిపర్వంలోనే గ్రంథారంభ ఘట్టంలో వున్న-

“చ. అమలిన తారకాసముదయంబుల నెన్నను సర్వవేద శా
     స్త్రముల యశేషపారము ముదంబున ముట్టను బుద్ధి బాహు వి
     క్రమమున దుర్గమార్థజల గౌరవ భారతభారతీసము
     ద్రము దరియంగ నీదను విధాతృనకైనను నేరబోలునే."

అనే పద్యంలోవున్న “భారత భారతీ సముద్రము దరియంగనీదను” అనే వాక్యంలో వున్న ఈదను అనే తుమున్నంతం (కవి యభిప్రాయంలో యిదితుమున్నంతమే) కవికి అభిప్రేతం కాకున్నను వ్యతిరేకార్థ కోత్తమ పురుషైక వచనంగా కూడా అర్థం యివ్వడం దుర్వారం గనక యీ అనర్ధానికి అదే సూచకం కావచ్చుననో, అదిన్నీ సూచకము కావచ్చుననో, (అధికస్యాధికం బలం) ప్రసక్తాను ప్రసక్తంగా వ్రాశాను. ఈదను అన్నది తుమున్నంతంగానే సమన్వయించుకున్నప్పుడు సముద్రతుల్యమగు భారతం చక్కగా సమన్వయించుకొని పూర్తి చేయడమంటే? చాలా కష్టసాధ్యం అన్నంతవరకే అర్థం వస్తుంది. కాని (ఆలంకారికమర్యాద అంతే) అపార్థానికి త్రోవతీయదు. ఆ క్రియ (ఈదను) ను వ్యతిరేకార్థకంగా అన్వయించడమే కాకుండా దానికి వొకదానికి మఱొకటి బలం, దరియం-గన్-అనేది కూడా కల్పితే వచ్చే అర్థమో?- (అగ్నివాయు సంయోగమై) నేను