పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/577

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

“శుభస్యశీఘ్రమ్”

581


సూచ్యార్ధాన్ని వివరిస్తూన్నాను. ఆ పద్యంలో నాలుగోచరణంలో- “దరియంగ నీఁదను విధాతృనకైనను నేరఁబోలునే?” అనే వాక్యంలో పూర్తిగా యీఁదుట దుస్తరమనే అర్థం కలదా? లేదా దానివల్ల నన్నయ్యగారు సంశ యాత్ములైనారా? అంటే లేదని యెవరంటారు? "సంశయాత్మామ వినశ్యతి" అనే అభియుక్తోక్తినిబట్టి తుదకు సంశయం సంశయమే అయింది అనుకోవడానికి అవకాశం పూర్తిగా వుండఁగా యింకా వివాద మెందుకో? భవతు. యింకాఆపద్యంలో ఆయీ అర్ధాన్ని బలపఱిచే అక్షరాలు బోలెఁడు వున్నాయి చూడండి 1. ఎన్నను (ఎన్నఁగల వాణ్ణి కాను) 2. పొందను (పొందఁగలవాణ్ణికాను) 3. ఈcదను (ఈఁదఁ గలవాణ్ణికాను) అనే అర్థం రాకుండా చేయడానికి యెవరికేనా శక్యమవుతుందా? నన్నయ్యగారేమో? ఆయీ మూఁడు క్రియలున్నూ అసంపూర్ణ క్రియలుగా (ఎన్నుటకున్నూ, పొందుటకున్నూ, ఈఁదుటకున్నూ) ప్రయోగించినారు. రెండో అర్థంలో అనఁగా? గ్రంథసమాప్తికాదనే సూచ్యార్థ సూచనలో సంపూర్ణక్రియలు (వ్యతిరేకార్థకోత్తమ పురుషక్రియలు)గా పరిణమించాయి. ఆలా పరిణమించకుండా చేయడానికి “విధాతృనకైనను నేరఁబోలునే?” అంటాను నేను- కాఁబట్టి యిదివఱలో పరంపరగా కవులుచెప్పే - “పూరములంబర పూరితంబులై" అన్నదానికన్న యిది మిన్నగా వుందో లేదో? సహృదయులు పరిశీలించి పరిగ్రహించవలసి వుంటుందని నేననుకున్నాను. యేదోవిధంగా వాది ప్రతివాదిభావాన్ని కల్పించుకొని వివాదించేవారిని తృప్తిపఱచడం నాకే కాదు. యెవరికీ శక్యంకాదు. నాకు పూర్తిగా పైపద్యంలో ఆయీసూచ్యార్థం వుందనే నమ్మిక కల్గి వ్రాశానేకాని లోకాన్ని మోసగించే తాత్పర్యంలో వ్రాయలేదు. జీవిత చరిత్రలో దీన్నిగూర్చి వక పద్యం వ్రాశాను. దాన్ని వుదాహరిస్తాను.

ఉ. 'ఎన్నను, పొంద, నీఁద, ననునీత్రితయమ్మును బెద్దయెల్గుతో
    నన్నయ పూర్తి చేయునని నమ్మిక లేమివచించు నిట్లొగిం
    గన్నులఁ గట్టినట్టులుగఁ గన్పడు చున్నను నేఁటి క్రొత్తతి
    క్కన్న త్రిలింగ లోనటులు కాదని వ్రాయువృథావివాదియై.

చాలును. ఈయన తాను తిట్టినతిట్లు తనవి కావనిన్నీ యెవరో తిడితే ఆ తిట్లను అనుకరించాననిన్నీ తాను కృతియిచ్చినట్లుగా అభిప్రాయపడడం సరిగాదనిన్నీ ఆచౌదరిగారు వగయిరాలతో వివదించుచున్నట్లు తెలుస్తుంది. ఆమాటలను త్రిలింగ ఆమోదించి ప్రచురించే యెడల దాన్ని గూర్చి వ్రాస్తాను. ప్రచురించడంలో ఆమాటలు ససారాలోకావో అనేవిషయ విమర్శ ఆపత్రికదే అని మాత్రం వ్రాసి యిప్పటికి దీన్ని ఆపుతాను.

★ ★ ★