పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/572

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

576

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


“ఇదుగో? నావిమర్శనకి జవాబు చెప్పలేక భయపడి యెవరో జమీనుదారులు బహుమతీగా యిచ్చిన జరీసేలుజోడు (గడి విప్పనిది) నాకిచ్చి క్షమాపణచెప్పాఁడు." అని యిప్పుడు సమ్మానించే బంధుసముద్రులతో ప్రసంగించుకోవచ్చును గదా? యింకా వ్యాసాలెందుకు? సంశయచ్చేదా లెందుకూ అంటాను. సరే? సార్థబిందు నిరర్థబిందు ప్రాసప్రసక్తిలోన్నుంచి చాలా దూరంపోయింది వుపన్యాసం. యీలాగే పెరుఁగుతుంది వ్రాత వ్రాసినకొద్దీ అని లోకానికి తెల్పడానికేనా యిది పనికి వస్తుంది కదా! యింక విమర్శకుఁడు గారు శృంగిగ్రాహికయా వుదాహరించిన “మీదుమాదులు" అనేచోట వున్నదుగాగమప్రసక్తితప్పా? వొప్పా? అన్నదాన్ని గూర్చి కొంచెం వ్రాసి విరమిస్తాను. యిది వీరినేకాదు చాలామందిని పొరపెడుతూ వుంది. దీన్ని గుఱించి మాజయంతిలో చూడండీ యేమని వ్రాయఁబడి వుందోను.

" 'నీదు' అనుచోటంబలె 'మీదు' అనుచోట దుగాగమము రాదని గురువులవాదము. దీనింగూర్చి 'గుప్తార్థ ప్రకాశిక' చక్కఁగా మందలించినది. కనుక నిపుడేని వారు దానిం జూడందగు.”

ఆయీ జయంతిని విమర్శకుఁడుగారికి దాఖలు చేసే వున్నాను. శ్రీవారు దాన్ని చూడలేదనుకోనా? (లోకంలో మాపుస్తకాలు ప్రత్యక్షర శోధగా చదివినవారంటూ కొందఱు వుండేయెడల వారి కెవరేనా “ప్రైజు” యిచ్చేయెడల అది వీరికి యిచ్చాకగాని మఱివొకరివ్వకూడదని నాసలహా) గుప్తార్థ ప్రకాశిక చూడలేదనుకోనా? చూచినా కనబడలేదేమో? అనుకోనా? యిదేమీ కాదు. చూడడం జరిగింది. కనపడా కనపడింది గాని ఆగ్రంథం వ్రాసిన బ్రహ్మశ్రీ కల్లూరివారి పాండిత్యం నచ్చలేదనుకోనా? భవిష్యత్తులో యింకా కలమాడిస్తే అప్పుడుగాని యీవిమర్శకుఁడుగారు దీన్ని గూర్చి యేతోవ తొక్కుతారో? బోధపడదు. పడడానికేముంది? "నేను మాత్రం వూరుకున్నానా?" అన్నట్టు శాంతిపర్వములో ప్రయోగం వుందని చూపిస్తే మళ్లా ప్రశ్నించనట్టే ప్రశ్నించారనుకోవాలి. యీసారి ఆ “మీదుమాదు"లను గూర్చి యేపుటలో యెన్నో పంక్తి దగ్గఱనుంచి యెన్నోపంక్తిదాఁకా వ్రాయఁబడివుందో కూడా వ్రాయవలసివుంటుందేమో? అవసరమైతే ఆపనికూడా చేస్తాను. పడరాని షాట్లన్నీ పడాలిగదా? నేను యిందుకే పుట్టినట్లున్నూ, ఆయన అందుకే పుట్టినట్టున్నూ అప్పుడు లోకం గుర్తించుఁగాక! అప్పటిదాఁకా అక్కఱే లేదు. ఈ పాటికే గుర్తించి వుంటుంది. (“భజగోవిందం" రోజులుకదా? యివి యెందు కొచ్చిన పిచ్చి లేక వెఱ్ఱిశంక లివి యెవరిదగ్గఱకేనా వెళ్లి చదువుకోరాదా?) “మీదుమాదు" ప్రయోగాల సమర్ధనమే కాదు. “మీదుమాదు" పాండిత్యాదులు సమస్తమూ తేలిపోతాయి. దీనితో