పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/571

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

“శుభస్యశీఘ్రమ్”

575


కూడా వీరివ్రాఁతలకు మనస్సా సమ్మతించరు. సంతోషించరు. ఆమోదించరు. ఈమాట నేను “నన్నయ్యభట్టు" వ్యాసంలో వ్రాసే వున్నాను. దాన్ని వీరు బోలెఁడు అప్రస్తుతాలు వ్రాసి పెంచి యీమధ్య వ్రాసిన “సంశయచ్ఛేదం" లోస్పృశించినట్టుగాని ఖండించేటట్టు లేదనియ్యేవే నానమ్మకం. మాతిరుపతిశాస్త్రికిన్ని వారికిన్నీ యెప్పుడున్నూ చుక్కెదురే గాని నాకూ వారికీ కొంత సంభాషణవగైరాలు కలవు. శ్రీరాజా భుజంగ రావుగారికొమార్తలలో వొకకొమార్త వివాహంలో కాదు యిద్దఱు కొమార్తల వివాహాలలో మేమూ మేమూ కలుసుకున్నాము. బ్రహ్మశ్రీ వేమూరి శ్రీరామశాస్త్రి శతావధానిగారు శ్రీవడ్డాది సుబ్బారాయకవిగారిని మమ్మల్నీ యింకా కొంత మందినిన్నీ పిల్చి విందు చేశారు. ఆవిందులో మా తి. శా. గారు శివరామ శాస్త్రిని ఆపంక్తికి తనతోపాటు రాకుండా చేశాఁడు. నేను యెంత చెప్పినా వినలేదుకూడానున్నూ నేను సోదరుల పంక్తిని భోంచేసిన వాణ్ణే. ఆయీమాభోజనం ఆయీ అవడంలోనే శివరామశాస్త్రి సహితంగా వచ్చి భోజనానికి ఆఁకలేస్తూందని విస్తళ్లు తీయకుండానే తొందర పెట్టినాఁడు. అంతకుపూర్వం ఆఁకలే లేదు. యీవేళ తినేదేలేదని శ్రీరామశాస్త్రి గారితో చెప్పి తక్కినవారిని భోంచేయవచ్చు నన్నాడు. ఆయీవిషయం సోదరుల జ్ఞప్తిలో వుందో? లేదో? చెప్పొచ్చేదేమిటంటే? నాకూ సోదరులకూ ప్రధానవిషయంలో తప్ప యిటీవల వ్యక్తిగతంగా లేశమూకూడా ద్వేషాలు లేవు. వారిలో పెద్ద సుబ్బారాయకవిగారు స్వర్గతులైనపుడు వారిసోదరులలో యెన్నో వారో వొకరు (ఉత్తరం తీసి చూస్తేనేకాని సరిగా చెప్పలేను.) ఆవిచారకరమైన దారుణవార్తను నాకు తెల్పినారు. నేను నా విచారాన్ని లేఖద్వారాగానే వారికి సాశ్రుతర్పణ పూర్వకంగా తెలిపి వున్నాను. -

“ముఖం వుంది. అద్దం వుంది.” యీసందర్భం సోదరకవులను పృచ్ఛ చేస్తే జ్ఞాపకం వుంటే వారు చెప్పకపోరు. యిట్టి సందర్భంలో "రోళ్లా రోకళ్లా పాడిన" గుంటూరిసీమలో వున్న చారిత్రక విషయాలు "గజం మిథ్య పలాయనం మిథ్య"గా మావిమర్శకుఁడుగారు అపవదించి యేదో పుస్తకమంటూ వ్రాసి రు.1-0–0 వెలకూడా పెడతారే? పోనీ యేదో మన పేరుమీఁదుగా ఆబ్రాహ్మడికి కొంచెం లాభం కలిగితే కలుగుతుంది పేరున్నూ కలుగుతుంది. దానికి సేల్జోడు బహుమానంతోడవుతుందనుకుంటే వొప్పుకోలేదు చూడండి. ఆశ్చర్యమాశ్చర్యం. భవతు. యేదో “ఘటం భింద్యాత్" అన్నారుకదా? పెద్దలు; దానికే సంతోషించింది కదా? స్వగ్రామం. వచ్చే బిరుదులేవో వచ్చాయికదా? యింకా ప్రయత్నం యెందుకంటాను? యింకా వ్యాసా లెందుకంటాను? యింకా వెం. శా. తెల్వితక్కువవాఁడు నేను తెలివైనవాణ్ణి అని వ్రాసి సంపాదించతగ్గదేమేనా వుందా? వెం. శా. కూడా సేల్జోడుపట్టుకొని సమ్మానించడానికి సిద్ధంగానే వున్నాఁడు కదా? దయచేసి స్వీకరించి