పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/57

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

61


ఈతి బాధలు

శ్లో “అతివృష్టి రనావృష్టి ర్మూషకా శ్శలభా శ్శుకాః
అత్యాసన్నాశ్చరాజాన షడేతా ఈతయ స్స్మృతాః"

అంటూ ఈతిబాధలను పూర్వులు ఆటింటినిగా పరిగణించివున్నారు. యీ ఆఱింటిలో ప్రతివొక్కదానిలోనున్నూ మటికొన్నింటికి అంతర్భావం చెప్పవలసివుంటుంది. ఆలా చెపితే దొంగలబ్లాధ, దోమలబాధ, రోగబాధ, వగయిరాలుగూడా కలిసివస్తాయి, అసలు శ్లోకానికర్థం వ్రాసి వ్యాఖ్యానం చేస్తాను

'అతివృష్టి' అంటే అబిసీనియాలోలాగ విశేషించి యెప్పడూవరాలు కురియడం. దీనివల్ల ముఖ్యంగా ఆ చెట్టునీడనూ ఆ చెట్టునీడనూ సంసారాన్ని వెళ్లంబుచ్చుకొనే ఆగర్భభిక్షాటన జనమున్నూ, పశువులున్నూ, పక్షులున్నూ మిక్కిలీ కష్టపడవలసివస్తుంది. వ్యవసాయానికికూడా యిది చాలా అపకారకమే కాబట్టి లోకానికి యిది మిక్కిలీ పీడాకరమని వేటే చెప్పవలసివుండదు. 'అనావృష్టి అంటే? దత్తమండలం వగయిరా ప్రదేశాలలోలాగ అసలే వరాలు యెగేయడం. అతివృష్టివల్ల వచ్చే చిక్కులవంటివే దీనివల్లా కొన్ని వస్తాయి. కనక విస్తరించేది లేదు. "మూషకాః దీన్ని గుఱించి వ్యాసాంతమందు విస్తరించ తలంచి యిక్కడ వ్రాయలేదు. శుకాః’ చిలకలు. చిలకలంటే? వక్క చిలకలే అనుకోనక్కఱలేదు. తల్లక్రిందులు పక్షులు వగయిరా మణికొన్నింటినికూడా వీట్లతోపాటు చూచుకోవాలి. యివి పూర్తిగా తల్చుకుంటే ఫలజాతిని సర్వాన్నీ వొక్కరోజులోనే నాశనంచేసి మనుష్యజీవితాన్ని సాగనియ్యవు. అన్నట్టు శలభాః అనే పదం యెత్తుకొనేలేదు. "రొట్టెకు రేవేమిటి?" అదిన్నీ టెక్కలతో యెగిరేదే కనక చిలకలు వగయిరా పక్షిజాతిలో అంతర్భావం చెప్పినా చెప్పవచ్చు. పక్షిజాతికంటేకూడా యీమిడతజాతి సస్యనాశనానికి పెట్టింది పేరు. “మిడతల దండు" అంటూ పెద్దలు చెప్పకోవడమేకాని యిప్పటికి సుమారు 25 యేళ్లకుపూర్వం నేను వీట్లనుగుఱించి యెఱంగనేయెఱంగను. 25 యేళ్లనాండు కోట్లకొలదిగానో అర్బుదాలకొలది గానో మిడతలు బాగా లొడితెండేసి ప్రయాణంలో వున్నవి మనజిల్లాలు కొన్నింటిని ఆక్రమించి ఆకాశంమీంద వున్నంతసేపు సూర్యరశ్మినిన్నీ భూమిమీంద వాలినంతసేపు సర్వసస్యాలనున్నూ మటుమాయంచేసి భగ్గంపాడుచేసి వదలిపెట్టాయి, అవి సంచరించి \