పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/568

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

572

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


యేమంటే? "శాస్త్రజ్ఞులు కాని విమర్శకులు" అని వ్రాస్తినిగదా? మిమ్మల్ని గూర్చి; ఆలావ్రాసి మళ్లామీకు శాస్త్రకర్తలమర్యాదలను వుదాహరించడం తప్పా, మఱీ తప్పా? అయితే యీ విధంగా ఆలోచించినట్టయితే మీకు సమాధానం వ్రాయడానికి మొదలెట్టడానికే ప్రాజ్ఞలోకం అంగీకరించదుగదా? అపద్ధతిని “మూలచ్ఛేదీ తవ పాండిత్యప్రకర్షః" లోకి దిగవలసి వస్తుంది. కనక "కంబళీలో భుజిస్తూ వెండ్రుకలు వెదకడానికి" మొదలుపెట్టక ఛందాను రోధంగా ఆపద్యాన్ని యావత్తూ వుదాహరించవలసిందే. నేను అట్లు చేసి వుండలేదు. యెప్పుడో యిప్పటికి సుమారు యాభైయేళ్లనాఁడు చూచినదవడంచేత నయితేయేమి యీప్రాసవిషయం తప్ప దానిలో జ్ఞాపకం వుంచుకోతగ్గ అర్థసారస్యం వగయిరా లేకపోవడంచేతనైతేయేమి, పద్యం యవతూ వుదాహరించవలసిందే. నేను అట్లు చేసి వుండలేదు. యెప్పడో యిప్పటికి సుమారు యాభైయేళ్లనాండు చూచిన దవడంచేత నయితేయేమి యీప్రాసవిషయం తప్ప దానిలో జ్ఞాపకం వుంచుకోతగ్గ అర్థసారస్యం వగయిరా లేకపోవడంచేతనైతేయేమి, పద్యం యావత్తున్నూ జ్ఞప్తిలోలేదు. యిప్పుడు మళ్లా వెదుకుదామంటే? తగినంత వోపిక కనపడడంలేదు. అదిగాక నేను చూచిన భారతం చాలా ప్రాచీనం. అది మా మామగారిది. దాన్ని ఆయన జీవితకాలంలోనే మేనగోడలి కుమారుఁడికి ఆయన యిచ్చివున్నారు. దాన్నిప్పుడు బళ్లారినుండి తెప్పించాలి. యెందుకీశ్రమ. "నమ్మీనమ్మక ప్రయోగాలు జ్ఞానప్రకాశము వగైరాలు". యిటీవల సంస్కర్తలు మార్చేశారు కూడాను. దీన్ని మార్చవలసి వుండదుగాని యేమో ఆలాగనిన్నీ నిశ్చయించడానికి వీలుకాదు బాగా పరిశీలిస్తేనేకాని? యింతకూ ఆప్రాస దుష్టమా? అయితే అప్పకవి “పాఁడి ద్రచ్చఁగనిమ్ము నాతండ్రి కృష్ణ" అంటూ కూడా వుదాహరించి సార్థబిందుకానికిన్నీ సంపూర్ణబిందుకానికిన్నీ (రేఫశ్లిష్టత్వవిషయం వుపేక్షిద్దాం.) వుచ్చారణలో యెంతో భేదం కనబడుతూ వున్నా ప్రాసను అంగీకరించాఁడుకదా? శ్రవణంలో లేశమున్నూ (పూర్వకాలంలో సంగతి మనకు తెలియదు.) ఇటీవల భేదమేలేదని - నగము - ఎసఁగులకు ప్రాసపెట్టనే లేదనుకుందాం.

సోమయాజిగారు పెట్టకపోతే మాత్రం మనం పెట్టుకోకూడదా? యిప్పుడదంతా వెదకడ మెందుకంటాను. సర్వతంత్రస్వతంత్రులున్నూ, నిరంకుశచర్యులున్నూ, అభినవపండితరాయలున్నూ అయిన శ్రీమాడభూషి వెంకటాచార్యులవారికిన్నీ శ్రీ అల్లంరాజు సుబ్రహ్మణ్య కవిగారికిన్నీ “ఇఁక” అనేపదం ప్రాసలో పెట్టి పద్యం చెప్పవలసిందని కోరినప్పుడు నడచిన వాదంలో ఆ ఆచార్లగారు తక్కినవి నిరర్థబిందుకాలు పెట్టి చెప్పితే ఆయన ఆక్షేపిస్తే చెప్పినసమాధానం సుప్రసిద్ధం కనక తిక్కన్నగారు ఆ లాపెట్టని పద్ధతిని కూడా యితర మహాకవులరచనలలో కుప్పతెప్పలుగా వున్న యీ