పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/566

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

570

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


అధఃకరింపఁబడలేదు. వృథాగా జయేచ్ఛతో పరాక్రమిస్తూ వున్న మీరు శ్రీపోతన్నగారి-

“మ. ఒనరన్ నన్నయ తిక్కనాది కవులీయుర్విం బురాణావళుల్ తెనుఁగున్ జేసియు” అన్న వాక్యానికేనా వెం. శా. సరియైన అర్ధాన్ని గ్రహించాఁడో? లేదో? కాస్త పత్రికాముఖాన్ని ప్రకటించండి. శ్రీమానాప్రగ్గడవారి అబ్బాయి వ్రాసిన వుత్తరం (నేను ప్రకటించింది) తమకేమేనా రుచిస్తే రుచించినట్లున్నూ, లేకపోతే లేనట్లున్నూ కొంచెం ప్రకటించండి. “శ్లో. యుక్తియుక్తం వచోగ్రాహ్యం బాలాదపి సుభాషితమ్, వచనం తత్తునగ్రాహ్య మయుక్తంతు బృహస్పతేః" యీశ్లోకార్థం తమరు అంగీకరించేదే కదా? అయితే ఆబాలకవి నేమంటారు.

(13) నవ్వొచ్చేది యింకొక మాట వ్రాస్తూ వుంటారు. మీరు ధైర్యంతో వ్రాసేదేనా? ఆమాట "మీవిమర్శనగ్రంథ మంతా పాఱఁజదివితే యేదో విజ్ఞులకు బోధిస్తుందంటూ వ్రాస్తారుగదా? మీరు ఆలాపాఱఁజదివితే అప్పుడు అందులోవున్న “పదియవ నాఁటి” వగయిరాలు వెగటుగా వుండక మధురంగా వుండడం తటస్థిస్తుందనేనా? మీ అభిప్రాయం. కానివ్వండి మీకుతూహలాన్ని తోసి రాజనడం యెందుకు? ఆలాగే ప్రత్యక్షరశోధగా యేపండితుఁడి చేతనో చదివించి ఆవ్రాత వెగటుగా లేదని ఆయన చేవ్రాలుతో నాలుగు అక్షరాలు పత్రికలో ప్రకటింపఁజేయండి. సరేనా? యిక్కడకి సర్వమూ మీ అభిప్రాయానుసారంగానే నేను వొప్పుకొన్నట్టయింది గదా! అయితే యిదంతా కొంత గంపచిక్కుగా కనపడుతుంది. తుదకి పసకట్టేది కాదంటారా? ఆపక్షంలో మిమ్మల్ని నేను బాధించేవాణ్ణి కాను. చక్కఁగా నాసగౌరవాహ్వానాన్ని ఆమోదించి నాసేల్జోడుసత్కారాన్ని స్వీకరించండి యింతే నావిజ్ఞప్తి. మీగ్రామంలో వుండే సంపన్న గృహస్థులకేనా తృప్తికరంగా వుండేటట్టు మీతిట్లను సమర్థించుకోవడం వకటిన్నీ రెండోది యెవరేనా మీ బంధుసముద్రులు సేల్జోడు బహుమానాని కెందుకు దయచేశారు కారని అడిగితే తృప్తికరమైన జవాబు యివ్వడం వకటిన్నీ జరిగినట్టు విని సంతోషిద్దామని కోరిక వుందనికూడా మఱోవిజ్ఞప్తి. ఆర్థికశంకలే మీరు మీ గ్రంథంనిండా చేసివున్నారని నాకు జ్ఞాపకం. ఆ పుస్తకం నావద్ద లేదని లోగడ మనవి చేసేవున్నాను. యిప్పుడు వ్రాసిన “సంశయ విచ్ఛేదా వచ్చేదం"లో శాబ్దిక శంకలు కొద్దిగా సూచించారు. వాట్లకి జవాబు యివ్వలేదని కూడా తేల్చారు. ఆగ్రహించారు. మీవాక్య ముదాహరిస్తునా?