పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/565

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

“శుభస్యశీఘ్రమ్”

569


పూచీపడుచున్నాననిన్నీ మళ్లామళ్లా పునరుక్తి ప్రాయంగా మనవి చేసుకుంటూ వున్నాను. -

(10) షరా:- యింతదాకా యీవ్యాసం వ్రాసిన తరవాత విమర్శకుఁడుగారి వ్యాసం తరవాయి కూడా వున్న పత్రిక వచ్చింది. దానిలోసారమల్లా వెం. శా. విమర్శకుఁడుగారికి వోడిపోయినట్టున్నూ అంతేకాక నన్నయ్యభట్టుకు గౌరవం కలిగించాలనే వుద్దేశంతో వెం. శా. వ్రాసిన వ్యాసం వాఁడివుద్దేశాన్ని నెఱవేర్చక నన్నయ్య భట్టుకు న్యూనత్వాన్ని కలిగిస్తూ వుందనిన్నీ పనిపడితే పండితసమక్షంలో వీట్లనేకాక యింకా వారు (విమర్శకులు) విమర్శన గ్రంథంలో వ్రాసిన విషయాలన్నిన్నీ సమర్ధించడానికి సిద్ధంగావున్నామనిన్నీ యేమేమో కొన్ని సాహసోక్తులు వ్రాసి వ్యాసాన్ని ముగించారు. నాకు పట్టరాని నవ్వు వచ్చింది. చెప్పొద్దూ కవితాధార అభినందనీయమని వొప్పుకున్నదే కదా? లోఁగడ సాహసమున్నూ అనాత్మజ్ఞత్వమున్నూ కూడా అభినందనీయులే అని వ్రాయకపోవడం తప్పుగదా? అనుకున్నాను.

(11)వాట్లకన్నిటికీ సరిపడేమాట యిదివఱలో నా యీవ్యాసంలో అసకృదావృత్తిగా దొరలేవున్నా మళ్లాయిక్కడ వుదాహరిస్తాను. అయ్యా! పండితసమక్షంలో మీతో వాదించడానికి నన్ను సమర్ధుణ్ణిగా లోకం వొప్పుకుంటుందని నేను అనుకోను. అందుచేత మీవిమర్శనగ్రంథంలో వున్న యితర విషయాలన్నీ వదిలిపెట్టి మీరు నన్ను తిట్లుకావనుకొని తిట్టినతిట్లను సమర్ధించడానికి మీకు యేపండితుఁడి పేరు నచ్చుతుందో? ఆ పేరుమాత్రం వుదాహరిస్తే అంతటితో మీమీఁదవున్నభారం వదలిపోతుందని మనవి చేసుకుంటాను. యేమేనా వాదోపవాదాలు చేసుకోవలసివస్తే ఆయనా, నేనూ చేసుకుంటాము, విశేషించి గ్రంథం పెంచక ఆపండితుల నామధేయాన్ని మాత్రం ప్రచురించ వలసిందని ప్రార్థిస్తాను. బాగుందా? యీలా అనుగ్రహించండి లేదా? వొకజయపత్రం వ్రాయించి తెచ్చుకోండి నేను కూడా వ్రాలుచేస్తాను. సంతోషించండి.

(12) ఇది విమర్శనగ్రంథానికి సంబంధించిన వాదవిషయం. మీరు నన్ను సమ్మానించడానికి రప్పించేవిషయం ఆలాగే నిల్చివుందని జ్ఞాపకం చేస్తున్నాను. నేను మిమ్మలిని సగౌరవంగా ఆహ్వానించిన ఆహ్వానాన్ని తాము నిరాకరించారు. అయినప్పటికీ మీగ్రామం వచ్చినప్పుడు మళ్లా ప్రయత్నించి చూస్తానని పలుసార్లు వ్రాసేవుండడంచేత అది అమల్లోనే వుంది గాని