పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/564

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

568

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


పెద్దలైన మీవిషయంలో కూడా అట్టిపట్టుపటాంగంవస్తే అది కవితా విషయంలోనే (లెక్కలవిషయంలో కాదు) అయితే అంతే జరుగుతుందనిన్నీ దానికి మీరు నాహృదయాన్ని బాగా పరిశీలించాలంటే? మారెండో చిరంజీవి శతావధాన్ని నాతోసమానుఁడనే వుద్దేశంతో యెవరేనా నాపంక్తిని కూర్చోపెట్టేయెడల వాణ్ణికూడా నేను నిషేధించే వాణ్ణి అనిన్నీ స్పష్టంగా మనవి చేస్తున్నాను. కనుక ఆవిషయమైన ద్వేషం నాయందు మీరు వుంచుకోవడం కేవలం అన్యాయమనిన్నీ నొక్కి వక్కాణిస్తూన్నానని మనవి.

(7) నాకు ధారాశుద్ధివిషయంలో అనఁగా సంస్కృత సమాసగ్రథన విషయంలో నన్నయ్యకు నన్నయ్యే కాని తక్కిన యిరువురున్నూ అతనికి దీటుకారన్న అభిప్రాయం శాఖాభిమానప్రయుక్తం కాదనిన్నీ విద్యాభిమాన ప్రయుక్తమేననిన్నీ ప్రమాణంచేసిచెపుతూ దాన్ని గూర్చి మాట్లాడడానికి మీకువుండుకున్న చదువుగాని, అనుభవంగాని, బొత్తిగా చాలవు కనక ఆ విషయమై యిఁకవాదం పెంచవద్దనిన్నీ కూడా ప్రార్థిస్తాను. తగ్గంత పిండి వుంటేకాని ఆయీ విషయం గోచరించేదికాదు. నాఅభిప్రాయం తప్పయితే దాన్ని నిరూపించతగ్గవారెవరేనా నిరూపిస్తారు. తిట్లవల్ల దాన్ని నిరూపించడం అసంభవమని యెన్నిసార్లు వ్రాసేది. శాంతం పాపం.

(8) నియ్యోగులునూ, వైదికులున్నూ కలిసి సంబంధ బాంధవ్యాలు చేసుకోవడం దగ్గిఱనుంచిన్నీ నాకు అభినందనీయాలనిన్నీ మా ప్రభాకర శాస్త్రి కొమార్తను శ్రీయుతులు విస్సా అప్పారావుగారి కుమారున కిచ్చిచేసిన పెండ్లిని నేను మనఃపూర్వకంగా అభినందించి వున్నాననిన్నీ కవితా విషయంలో పిండిప్రోలివారిని గూర్చిన వ్యాసంవల్ల గుణమే ప్రధానంగాని నాకు శాఖప్రధానం కాదనిన్నీ మీకు కారణాంతరంచేత గోచరించక పోయినా యితరుల కందఱకి పూర్తిగ గోచరిస్తుంది. కనక ఆదోషాన్ని నామీఁద ఆపాదించవద్దనిన్నీ తామే భరించవలసి వుంటుందనిన్నీ మనవి చేసుకుంటాను. తరువాత తమచిత్తం.

(9) మీరు మావూరు నేను చేయఁదలఁచుకొన్న సన్మానానికి రావడానికి లేశమున్నూ భయపడనక్కఱలేదనిన్నీ రౌండుటేబిలు సభకువెళ్లిన గాంధీగారిని ఆహ్వానించినవారెంత భద్రంగా కాపాడి మనదేశానికి సమర్పించారో? మిమ్మల్ని కూడా అంత భద్రంగానే మీ గ్రామం పంపించడానికి