పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/563

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

“శుభస్యశీఘ్రమ్”

567


లేదో! లేకపోతే యెందుకు లేదో? లోకానికి తెల్పినపిమ్మటఁగాని వృథాగా యిఁక వివాదం పెంచవద్దని విమర్శకుఁడుగారిని కోరుతున్నాను. యెందుచేతనంటే యీమూలకంగా పేరుసంపాదించుకోవాలని ప్రయత్నించేమీకు యిది ఆవశ్యకంగా తోఁచినా “యెక్కడనో ధాత లిఖించినకారణంచేత” రాఁదగ్గపేరు రానే వచ్చింది కనుక నాకిది “యూసులేసుగా" కనపడిందనివిజ్ఞప్తి.

(4) మీతాలూకుతిట్లుతిట్లేకాని మఱివకటికావు. ఆతిట్లు తక్కినవిమర్శగ్రంథంవల్ల సవరణకావు, యెన్నటికీకావు అందులోవున్న వెగటు సర్వమూ మీఁదేగాని నేను తెచ్చిపెట్టిందికాదు. మీబుద్ధిపూర్వకమేగాని ప్రమాద ప్రయుక్తమున్నూ కాదు. అందుకు వేఱేసాక్షులక్కఱలేదు. మీహృదయమే సాక్షి! జవాబుదారీ దానిదే అందులో శ్లేషగాని, అన్యాపదేశంగాని, యితర ధ్వనిగాని, యేవిధమైన కమ్మీగాని లేశమున్నూలేదు. శుద్ధబట్టబయలు కనక ఆలాటి వృథాఆరోపణలు చేయవద్దని 76 వత్సరముల ప్రాయములో వున్న మిమ్మునేను కడచిన ప్రమాదమే చాలు యింకా ప్రమాదపు వ్రాతలు వ్రాసి పరాక్రమించవద్దని మీ శ్రేయస్సుకోసం సాంజలిబంధంగా ప్రార్థిస్తాను. కోపం ఆఁపుకోలేక పోయారు యిప్పుడే మనుకుంటే కలిసి వస్తుంది. యెవరో యెందుకు తుదకి మీ చిరంజీవులు, మునిమనుమలు, పసిపాపలు యెదురుకున్నా మీకు జవాబు సున్న

(5) నేను పెద్దవాణ్ణి, మీరూ పెద్దలే (నాకన్న కూడాను) కనక యీ తుదివయస్సులో అనవసరపు వివాద మెందుకు? కనక అన్యోన్యమున్ను అన్యోన్యసత్కారాలు అన్యోన్యగ్రామాల్లో యథాన్యాయంగా స్వీకరించి లోకం యొక్క ఆమోదాన్ని పొందడం మంచిదని విన్నవిస్తాను. తరువాత తమచిత్తం- యీతుది వయస్సులో మీకు భగవంతుఁడీతీరని శల్యాన్ని తెచ్చిపెట్టినాఁడు. జయేచ్ఛ మీకు యీచిక్కు తెచ్చిపెట్టింది. యింకాపరాక్రమిస్తే మఱీబాగుండదు కనక సమ్మానాన్ని స్వీకరించి జయగుర్తుగా మిమ్మల్ని ప్రేమించే అమాయికులవద్ద డచ్చీలు ప్రచురించుకోండి.

(6) మీకు ప్రధానంగా మనస్సులో వున్నకోపమల్లా నేను నాఁడు యెప్పుడో మాంధాతలనాఁడు (ముఫ్ఫైయేండ్లప్రాంతంలో) యెవరికో మీ శాఖవారికి సహాసనాన్ని కవితావిషయంలో నిషేధించడంకదా? అది చాలా యుక్తమే అనిన్నీ అంతేకాని శాఖాద్వేషప్రయుక్తం కాదనిన్నీ రేపు నాకంటే చాలా