పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

60

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


యెవళ్లాపంగలరు? యింతమాత్రంచేత అన్నగారు దాసుగారిమీంద అసూయ పెట్టుకున్నట్టు మాత్రం వినలేదు. ఆయన ప్రాజ్ఞత్వం యేలాటిదో చదువరులు విచారించుకోండి. అయితే మన కథానాయకులు సోమయాజులుగారు దాసుగారి అన్నగారీమాత్రం ప్రాజ్ఞలున్నూ కారా? మహావిద్వాంసులు కదా, అంటే యేంమనవిచేసుకోను. వకరితత్త్వం వకమోస్తరుగావుంటుంది. విద్యా విషయం అల్లావుంచండి. వక మహాపండితుండో, లేక కవీశ్వరుండో వున్నాడనుకోండి. అతఁడు అత్తవారింటికి వెళ్లేడు. అతణ్ణి ఆ వూల్లో వుండే అమ్మలక్కలు యేలా వ్యవహరిస్తారు? మన పుల్లమ్మ మొగుడే అంటారు. అంతమాత్రంచేత తనపేరు ప్రతిష్టలకు భంగం వచ్చినట్లాలోచించుకొంటే యేలాగ? యుక్తులకేమి, యెన్నేనా చెప్పవచ్చు. ఐనది కాదనటానికిన్నీ వీలుంటుంది. కానిది అవుననడానికిన్నీ వీలుంటుంది. యేమైనా, యొక్కడేనా బావాఅంటే వప్పుకుంటాను గాని వంగతోCటదగ్గిఱ మాత్రం అంటే వప్పుకొనేది లేదన్నాండన్నలోకోక్తి యెఱంగని వారెవరు? సోమయాజులుగారు తమ్ముని శ్రేయస్సును సర్వవిధాలా కోరేవారే అయినప్పటికీ, ఆయన పేరుద్వారా తమపేరు పైకివచ్చినట్లు మాట్లాడితే అందుకు అంగీకరించారుకారు. ఇందుకు వాల్మీకి రామాయణంలో వున్న— “అగస్త్య భ్రాతరం" అన్న వాక్యం పూర్తిగా తోడ్పడుతూవుంది. అగస్త్యులవారివలెనే ఆయన అన్నగారుకూడా మహా తపశ్శాలియేకదా! అయితే అగస్త్యులవారుచేసిన ఘనకార్యాలు వింధ్యపర్వత స్తంభనం, సముద్రోదకపానం వాతాపిజీర్ణం కథవగయిరాలవల్ల యొక్కువ లోకానికి చిరపరిచితులై వుండడంచేత పెద్ద పేరుకలిగివున్నారు. అన్నగారో! అట్టివారుగా లేరు. దానికి యెవరేంచేస్తారు? దాన్నింబట్టి వాల్మీకిమహాకవి ఆ ప్రకారము ప్రయోగించాcడు. అప్పడు మొదలు యిప్పటివరకున్నూ అది అప్రయోజకుcడికి పర్యాయపదమైపోయింది. దాన్నింబట్టి సోమయాజులుగారికి కోపం వచ్చింది. దీన్నిబట్టి యిదిన్నీ సమర్థనీయంగానేవుంది. కానివ్వండి ΟΟΟΟ వికల్పాలకేమి? బులుసువారి వంశంలో అంతా మహావిద్వాంసులే అన్నది మనకు కావలసింది. అందులో వేంకప్ప సోమయాజులు గారు, అధీతిబోధాచారణ ప్రచారణములుగల మహావిద్వాంసులు. ఆ పుణ్యపురుషుణ్ణి గూర్చి అంతో యింతో ముచ్చటించుకోవడంవల్ల మనం కూడా ధన్యులం. యింకా వీరితండ్రిగారిని గూర్చిన్నీ తమ్ములు పాపయ్యశాస్రులవారిని గూర్చిన్నీ వారి కొమాళ్లు ప్రకాశశాస్రుల్లుగారిని గూర్చిన్నీ యెంతో వ్రాయవలసివుంది. ఆ వ్రాయడం ప్రత్యేకించి ప్రత్యేకించి శీర్షికలు పెట్టి వ్రాయవలసిందేకాని “సర్రాజు పెళ్లిలో గుర్రాజుకొకపోcచ” అంటే తేలేదికాదు. కాబట్టి మణివకప్పుడు వ్రాద్దామని యిప్పడింతటితో ముగిస్తూ వున్నాను. ★ ★ ★