పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/556

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

560

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


నన్ను రమ్మని కోరడం ఆలా వుండఁగా ఆగ్రామంలో వుండే సంపన్నగృహస్థులు నన్ను ఆహ్వానించాలని అనుకొంటూ వున్నట్టు తెనాలిరైలులో వకరు ఆవూరివారే బ్రాహ్మణులు జానపాటివారు చెప్పివున్నారు. అందుచేతనైతేనేమి? యిందుచేతనైతేనేమి? ఆవూరి ప్రయాణం నాకు యేలాగా బ్రాహ్మ వ్రాసి పెట్టినట్లే వూహకు వస్తుంది.

శా. “ఏవేళ న్మఱి యేస్థలమ్మునను నేయేరీతిగా నున్నదో
     ఆవేళన్ మఱియాస్థలమ్మునను ఆయారీతియైతీరు సూ
     ర్యావిర్భావముఁ బ్రొద్దు గ్రుంకుటయు దృష్టాంతమ్ము లిప్పట్ల నీ
     భావమ్మింత యెఱుంగదైర్యము మదిన్ బాటిల్లుఁ గామేశ్వరీ”

కాఁబట్టి వారికి లోగడ సంగ్రహంగా మనవిచేసుకున్నవికాక, చేదస్తంగా వున్నాయే అని విమర్శకులు పరిహసించేవైనా మరికొన్ని కూడా మనవి చేసుకొందునా? అయ్యా! నాకు వుండే వ్యాధిప్రకోపావస్థలో వున్నప్పుడు నేను పొరుగూళ్లోనే కాదు. స్వగ్రామంలో స్వగృహంలో కూడా స్తిమితంగా వుండేస్థితి చాలా దుర్ఘటంగానే వుంటుంది. దానికి కొన్ని వుపాయాలు “సవాకోటిదరిద్రాలకు అనంతకోటి వుపాయాలు” అన్నట్టు నేను యేర్పఱచుకొని గాజుకాయమాదిరిగా ఆయుశ్శేషాన్ని గడుపుతూవున్నాను.

మ. “ఎపుడున్ వ్యాధికి నర్ఘ్యపాద్యములుగా నెన్నెన్నొమందుల్ సమీ
     పపుగూటన్ బదిలమ్ముచేసికొని నిన్ బ్రార్థించుచున్ వీలువ
     డ్డపుడెల్లన్ భగవచ్చరిత్రములు వ్యాహారించుచున్ నేనిటుల్
     కృపణత్వ మ్మెడగాఁగ నుంటి నిది నీదేచల్వ కామేశ్వరీ” 682

అంకెనుబట్టి యీసౌభాగ్యకామేశ్వరిపద్యాలెన్ని వందలున్నాయో చదువర్లు గుణితిస్తారు. పద్యంలోవున్న అంశంవల్ల ప్రస్తుత జీవితవైఖరికూడా గ్రహిస్తారు. ఈ కారణంచేతనే నేనువాదానికి భయపడి శ్రీపోవూరి వేంకటేశ్వర్లుగారు నాకు మునియేడు వ్రాసిన (విమర్శకుఁడుగారి అనుమతిమీదనే అనుకుంటాను) వుత్తరాలకు అనగా విమర్శనగ్రంథం అచ్చుకాకపూర్వం అందులోకొన్ని మచ్చుకు శంకలు వుటంకిస్తూ వ్రాసినవుత్తరాలకుచాలా శాంతంగా, నిస్పృహగా మనవి వ్రాసుకున్నాను, వారావిషయం తెల్పకపోరనుకుంటాను. అదిఆలా వుంచి-అందులోదే (సౌభాగ్యకామేశ్వరిలోదే) యింకోటి వుదాహరిస్తే యింకా కొన్ని విశేషాలు బోధపడతాయి.

మ. "ఒక పన్నున్నది నాకు విఘ్నపతినో? ఒక్కండె కన్నుండె నా
     కకవీంద్రుండనొ? తెల్పు మంబరొ? భవత్కారుణ్య మీనాకుఁద