పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/551

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

“శుభస్యశీఘ్రమ్”

555

అనే పద్యమున్నూ-

శా. ఈమంత్రార్థము నే నెఱింగినటు లింకేయార్యులు న్నేర రే
     నీ మంత్రమ్ము జపించియే జయముమై నేపారితిన్‌దిట్లు నా
     కేమిన్ రావనుకోకుఁ డందుననునింకే యొజ్జలుం బోల రే
     నేమో? తిట్టెడివారిఁ దిట్టకయె హాయి న్విందు నాతిట్టులన్.

అనేపద్యమున్నూ వీరు చదవకుండానే వుంటారా? చదివివుండిన్నీ తమపుస్తకంలో వున్న తిట్లను సవరించుకోక పోవడంవల్ల వీరియెడల దైవాని కప్పటికప్పుడే చేసిన అనుచితప్పనివల్ల ఆగ్రహం కలిగిందనిన్నీ ఆకారణంచేత సవరణ చేసుకోకుండానే ముద్రణం చేసుకొమ్మన్నాఁడు కాబోలుననిన్నీ అనుమానించవలసి వచ్చింది. యిక్కడనొక అవాంతర విషయం పైపద్యంలో అతిఝడితిగా స్ఫురించింది. యీలాటి వెన్నో నాకవిత్వంలో నాకు అప్పుడప్పుడు గోచరిస్తూ వుంటాయి. కాని అవి యితరులకు గోచరించి వ్రాయవలసిన రహస్యాలుగాని గ్రంథకర్తకు గోచరించినా వ్రాయఁదగ్గవి కావు. వ్రాసుకుంటేనో? యెవరోతప్ప తక్కినవారు గేలి చేస్తారు. యెక్కడోగాని సహృదయులుండరు. అందుచే వ్రాయకూడదు. అయినా యిక్కడ వ్రాస్తున్నాను. నేను యేపుస్తకాన్ని అచ్చుపడ్డదాన్ని వీరికి యిచ్చి వున్నానో? ఆయిచ్చేసమయానికి వీరెవరో నాకు సుతరామున్నూ తెలియదుగదా? అంతకు పూర్వమో అంతకంటే తెలియదు. తి. వెం. కవుల గ్రంథ విమర్శనం అన్నపుస్తకమంటూ యెవరేనా వ్రాసేరన్నసంగతేనా అప్పటికి నాకు తెలుసునా? తెలియదు. అదిన్నీకాక అప్పటికే అచ్చుపడి ఆఱుమాసాలకు సుమారుకాలం అతిక్రమించిందికదా? జయంతికి; అట్టిజయంతిపుస్తకంలో విమర్శకుఁడుగారి యింటిపేరికి వికృతి అయిన "ఒజ్జ" పదం వుండడానికి నాలో నాకే ఆశ్చర్యంగా కనపడి అది దాఁచుకోలేక పత్రికక్షులు గేలిచేస్తారని యెఱిఁగికూడా యిక్కడ వుటంకించాను. అంతమాత్రమే కాదు. యీయన శుద్ధ తిట్టుమోతు అనికూడా ప్రకరణవశంచేత ఆపద్యార్థంవల్ల తేలుతుంది. ఇంతేకాదు. “ఒజ్జ" పదానికి ప్రకృతిగావుండే పదం యింటిపేరుగాగలవారైతే తిట్లల్లో ప్రజ్ఞకలవారే గాని పనిపడితే ఆ తిట్లల్లో నాకు వారు తీసిపోయేవారేగాని, హెచ్చేవారుకారనిన్నీ నాకు వచ్చినతిట్లు నేనెన్నఁడూ వుపయోగించననిన్నీ వుపయోగించినా అందులోకూడా కవిత్వపదార్ధంవుండి “క. వీcడా? నాకొకకొడుకని గాడిద యేడిచెగదన్న ఘనసంపన్నా?” అన్నట్లుంటాయిగాని, యింత అయుక్తంగా వుండవనిన్నీ, అందులోనున్నూ నన్ను తిట్టేవారిపట్ల వాట్లని బొత్తిగా వుపయోగించే వుద్దేశం నాకు అసలే కలుగదనిన్నీ నేనల్లా వారు నన్నుతిట్టేతిట్లు హాయిగా వినడమే చేసి ప్రచురించి వూరుకుంటాననిన్నీ ఆపద్యార్థం