పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/544

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

548

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


"అప్రతిపత్తిమూఢమనసా ద్విత్రాస్థితా నాడికాః" అన్న యెత్తు నేనెత్తడంచేత యేమీ వ్రాయడానికి కలమాడక యీలా అపహాస్యపు టక్కరాలు వెళ్లఁగ్రక్కారే! కాని అసలు శక్తి యీలాటిది కాదు. లౌకికాగ్రేసరులు అంకెలలో మంచి పాండిత్యముంది. దాన్నిబట్టి సంఖ్యావంతులు కూడా (అసలు సంఖ్యావచ్ఛబ్దవ్యుత్పత్తి వేఱుకదా) అనఁబడతారు. యీమధ్యనే అభినవ తిక్కయజ్వలు కూడా వారి గ్రామంలోనే (యింట గెల్చిరచ్చ గెలువు మన్నారుకదా) అయి వున్నారు. యీ పైని త్రిలోక విజయంకూడా చేస్తే చేస్తారేమో; “పదియవనాcటి ముతైదువునూ, దశాహంనాcటి ముతైదువునూ" బంగారు పట్టుతల్లిగా సమర్ధిస్తారు. (ఇంకా యీలాటి అపృచ్ఛ్యప్రసంగం చాలావుంది.) దానితో ఆ బిరుదేకాదు సర్వమూ సమర్ధితం అవుతుంది చూస్తాము. కానీ ధూళిపూడి గ్రామస్థులకు మహాకవి తిక్కన్నగారియెడల గౌరవం లవలేశమున్నూ లేదేమోనని వివేకులు అనుమానించవలసి వస్తుందేమో అని నాచింత. యేమంటే? యీయనజ్ఞానం మిక్కిలి సామాన్యంగా కనపడుతూ వుంది. వీరికిచ్చినస్థానమేమో పెద్దది యిప్పుడు తిక్కన్నగారి యశఃకాయమే వుందిగాని అసలు కాయంలేదు. పరిశీలించేవారు అనుకోరుగాని, స్థూలదృష్టులు వారి బండారంకూడా యింతపాటిదే అనుకుంటే? అయ్యో కర్మమా! తిక్కన్నగారి ప్రజ్ఞావిశేషపరిజ్ఞానానికి యీలాటి వుపమేయ స్థానాలేనాగతి? అలా యెవరంటారు, గాని లోకంలో ప్రాజ్ఞుల సంఖ్య చాలా తక్కువ, ప్రాజ్ఞేతరులే అనఁగా? జ్ఞానలవదుర్విదగ్ధులే యెక్కువ. అందుచేత కొంత వారికికూడా మనం భయంపడవలసి వుంటుందని నామనవి. సరిగ్గా నాలుగు పంక్తులు వ్రాయడానికి సామర్థ్యం పూర్ణానుస్వారంగా వుండే వీరు పెద్దపెద్దమాటలు ప్రకటిస్తారే! యీసాహసం వీరికి యొక్కడనుండి వచ్చిందోగదా! ఆ యీ సందర్భం యిఁక లోకమే తేలుస్తుంది. అందుకే నాశాంతి మంత్రాలు వీరికి నచ్చాయి కావు. నాసంధి అంతకంటే నచ్చింది కాదు. నాసమ్మానాన్ని నిరాకరించారు సరే, అంతటితోనేనా వూరుకున్నారా! ఊహూ! ఊరుకోలేదు. యీ క్రింది వాక్యాన్ని చిత్తగించండి.

“అట్లుకాదేని వారు వచ్చినశత్రుణ్ణి నన్ను జామాతగా విమర్శకుడు గారు బుద్ధిపూర్వకంగా అంగీకరిస్తారని యెవరనుకుంటారు? భవతు. యేలాగయితేనేమి? యిప్పటికి మనుగుడుపు ఆహ్వానందాఁకా వచ్చింది కదా? యీ వివాహం సర్వథా రాణిసంయుక్తకున్నూ, పృథ్వీరాజుకున్నూ జరిగినమాదిరిగా ఆచరిత్ర యెఱిఁగినవారు భావిస్తారు. సంయుక్తతండ్రికి యేకోశమందున్నూ పృథ్వీరాజుయందు యిష్టంలేదు, లేకపోతే మాత్రం దైవలిఖితం తప్పుతుందా?

"ఎన్నఁగ రాదుగా? మఱియు నేఱికి నేఱికి ధాత వ్రాయునో కృతి యిచ్చి వుండిన్నీ బహుమతి పుచ్చుకోవడానికి దయచేయవలసిందని నేను సగౌరవంగా కోరితే గతంలో