పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/543

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

“శుభస్యశీఘ్రమ్”

547


పడుతూ వుంటాయి. వాట్లన్నిటికీ మేము బాధ్యులమా? మీలో మీరు వాదోపవాదాలద్వారా తీర్చుకోవలసిందే అనిగాని, లీగల్‌గా అనిగాని జవాబు చెపుతారా. యిది స్పెషల్ విషయంగా మీరు పరిగణిస్తారనియ్యేవే యింతగా వ్రాశాను గాని లేకపోతే యీమాత్రానికైతే వ్రాయను. ఈయనకు జవాబు చెప్పలేకపోను? (అనcగా యిప్పుడేకాదు జీవితానంతరం అధమం ఒక సంవత్సరందాకా కూడా చేతిలో లేఖిని పనిచేస్తూనే వుంటుందని నా పిచ్చి నమ్మిక) గాని యీ వయస్సులో యీలాటి అనుచిత ప్రసంగానికి (అనగా కోర్డువారు తీర్చవలసిన దానికన్నమాట) నేను జవాబులు వ్రాస్తూ కూర్చుండడానికి లోకోపకారకార్యాలలో తఱుచుగా ప్రవర్తించే మీబోట్లు ఆమోదిస్తారా? మీ పత్రికపుట్టి సుమారు యిరవైయేళ్లేనా కాకపోదుగదా? యేవిమర్శకులేనా యే గ్రంథకర్తనేనా “పదియవనాఁటి ముత్తైదువు" లోనైన అపృచ్ఛ్యపు మాటలతో బహూకరించి నట్లెఱుఁగుదురా! అట్టిమాట లెన్నఁడేcనా మీరు (ఇప్పుడూ ఆమాటలు మీరు ప్రకటించ లేదుసుడీ పాపం! ఆయనే ప్రతిష్ఠకోసం చిరకాలం దాఁచిదాఁచి యిప్పటికి అదృష్టంపండి స్వద్రవ్యంతో బయటికిఁ బెట్టివున్నారు.) మీ పత్రికలో ప్రకటించి వున్నారా? అని నా ప్రశ్న తాము జూడలేదు యీయన తిట్లని యీసంగతి నేనెఱుఁగుదును. యీయన విమర్శకులు కారు. వట్టి అనాత్మజ్ఞులు అని నేను తెలిసికొన్నాను. మొట్టమొదటనే పంపిన భారతసంశయవిచ్ఛేదం మీఁద అభిప్రాయం అసలు వారు కోరకుండానే నాఅంతట నేనే వొకమాదిరిగా యిచ్చి మెల్లిగా రంగంలోకి అవతరింపచేశాను. అప్పుడీపుస్తకం విమర్శనం పంపించారు. చూచాను. సమ్మానించ తలచాను. దానికి ఆయన నాకు అనుగ్రహించిన ప్రత్యుత్తరం ఇది. -

“తామే మాగ్రామము వచ్చి సభచేసి చేయవలసి యుండునుగాని నేను తమగ్రామము వచ్చుట తగియుండదు.”

“యెందుచేత తగియుండదోకదా? కృతిప్రదాత కృతి నాయకుని కడ కేగి సమ్మానింపఁబడుట ఆచారమా? కృతినాయకుఁడు కృతియిచ్చిన గ్రంథకర్తయింటికేగి సమ్మానాన్ని పొందుట ఆచారమా? తిక్కన్నసోమయాజులుగారికి కేతనమహాకవి దశకుమారచరిత్రను కృతినిచ్చెను గదా? దానిని తిక్కన్నగారి గృహమునకు వచ్చి వినిచి సమ్మానమును తిక్కన్నగారి గ్రామములో పొంది వుండునా? లేక తిక్కన్నగారే కేతన్నగారి వూరు వెళ్లి అక్కడనే కేతన్నగారి కవిత్వాన్ని విని వారింటే భోంచేసిసమ్మానించి వచ్చివుంటారా? మనుమసిద్ధి తిక్కన్నగారింటికి వచ్చి ఉత్తర రామాయణాన్ని విని సత్కరించి తన రాజధానికి లేదా కోటకు వెళ్లియుండునా? యింతటి పరిజ్ఞానంకూడా గుం. డి. విమర్శకుఁడు గారికి లేదని లోకం అభిప్రాయపడరాదు. నేను అంతకంటే పడేదిలేదు. కాని యేంచేస్తారు పాపం! వురిలో చిక్కారు.