పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/542

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

546

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


సహాగా సత్కరించడానికి సంకల్పించుకున్నాఁడు. కాబట్టి వారు వాఁడికోరిక తీర్చడంకన్న కర్తవ్యం లేదు. పైఁగా “నేను విమర్శన గ్రంథమున వ్రాసిన విషయములకు సరియైన సమాధానము వ్రాసిరేమో చూడఁడు.” (యెంతముద్దుగా వుందో? యీ వాక్యం పరిశీలించాలి) అని కూడా వ్రాస్తారే? నన్నయ్యను గుఱించిన ఆక్షేపణ దానిలో వున్నదేనా? మీసప్రస్తావన దానిలోదేనా? వాట్లను గూర్చి నన్నయ్య భట్టు వ్యాసంలో మొదటి దానికిన్నీ దీనిలో మీసప్రసక్తికిన్నీ సమాధానం వ్రాశానా? తక్కినదానికి బంధుసముద్రులకి బరాతం పెట్టివున్నానా?

యిఁకనల్లా “పదియవనాటి ముత్తైదువు వగయిరా తిట్లకు నేను జవాబు చెప్పవలసి వుంటుంది. యేమని చెప్పాలో తోఁచకే సేల్జోడు బహుమానంగా యివ్వదలచుకున్నాను. (వెనక అధాత్తువాదం చేసి నీయమ్మజిజ్ఞాసా అంటూ వాదించినపండితుడి కేశాలు శిరస్సున ధరించి తనకు రాజుగారిచ్చిన బహుమానం ఆయనకిచ్చిన సంగతి లోకానికి తెలియదా? వెం. శా. ఆయనకి తీసిపోతాఁడా) ద్రావిడ స్త్రీల కుచాలుకూడా తడివినందుకు వొక్కనాకేకాక పత్రికాధిపతులకుకూడా సంబంధం వుండడంచేత మేము ఉభయులమున్నూ చెఱివక సేల్జోడున్నూ బహుమతీచేస్తేనేగాని మా పాపాలు పటాపంచలైపోవు. వెల్నాటికనక తి. శా. కి యీ ప్రాయశ్చిత్తం చేసుకోవలసివుండదు. ధన్యుడు! కనక వేంకటేశ్వర శాస్త్రులవారిని హెచ్చరిస్తూన్నాను. సేల్జోడు సిద్ధంచేయమని. యిఁకమీఁదటనేనా యీలాటివారి వ్యాసాలు అనాలోచితంగా ప్రకటించి నాబోటి సర్వసంసిద్దులకి అమాంగళ్యపు వ్రాఁతలు (మఱివకప్పపుడేనా సరే) వ్రాసే యీలాటి ప్రబుద్దులద్వారా పనికల్పించి బాధించడం యుక్తంకాదని పత్రికాప్రవర్తకులకు తోఁచేయెడల క్రియారూపంగానో, వాగ్రూపంగానో వారిఅనుతాపాన్ని ప్రకటించ గోరుచున్నాను. లేదా? పరుండియే నే నింకా బళ్లని తోలగలను వ్యాసాలు. వాట్లని జాగ్రత్తగా ముద్రించి ప్రకటించి ఆయీలోపాన్ని సవరించుకోవలసిందని ప్రార్థిస్తాను. విమర్శనగ్రంథం చూచినట్లయితే మీరు యెంత యేవగించుకుంటారో అనుకుంటాను. అయినా నాకోసంచూచి అందేదేనా ఉత్తరం యియ్యతగ్గది వుందేమో? పత్రికాధిపతులు చూపితే దానికి తోఁచినసమాధానాన్ని యిస్తాను. అధిపతులే అక్కఱలేదు. నన్ను ద్వేషించేవారు సుప్రసిద్దులు కొందఱున్నారుగదా? పేళ్లెందుకు తీరికూర్చుని ఆ ద్వేషించేవారిని ఆశ్రయించేనా సరే తిట్లుకావని వారిచేత అనిపిస్తే యింకో సేల్జోడుకూడాను. సరేనా అసలు విమర్శకులకు నన్నుప్రశ్నించడానికి అర్హత యెంత వఱకు వున్నట్లు గోచరిస్తుందో? ఆయనచేసిన “పదియవనాఁటి" వగైరా 31 ఆశీర్వాదాల వల్లనే కాక యింకా గ్రంథంలోవున్న ఆశీర్వాదాలవల్ల కూడా నిర్ణయించి పత్రికలో పత్రికాధిపతుల ఆచార ప్రకారం ప్రకటించి లోకాన్ని సంతోషపెట్టఁగోరతాను. పత్రికలలో పలుసంగతులు