పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/541

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

“శుభస్యశీఘ్రమ్”

545


విపరీతార్థమేమో? అసలు వారి సుపరీతార్థమేమో శ్రీ వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రులు గారు గాని, లేదా వీరిని ధూళిపూడి సభలో అభినందించి నాపేరు లేక మాయిద్దఱి (తి. వెం. కవుల) పేరులు యెత్తికొన్న శ్రీ శిష్ట్లాశాస్త్రులుగారు గాని లేదా ఆ సభకు ప్రసిడెంటుగా శ్రీ పిఠాపురం మహారాజావారి కాలేజీ నుండి దయచేసిన పండితమండనులు గాని నాకు తెల్పి మందలింతురని కోరుచున్నాను. నేనొకవేళ అందులో సుపరీతార్ధమే వుందని ఆబ్రాహ్మడికి యీలోకంలోనే కాదు పరత్రకూడా అపకారం యెందుకు కలగాలనిఅన్నా వెగటుగాలేదు సొగసుగానేవుంది. స్వర్గానికి మెట్లు కడుతూవుందని అబద్ధానికి సిద్ధపడి వాదించడానికి దిగినా; ఆయీ ముద్దుమాటలను సీ! యని రోయని పుణ్యాత్ము లెక్కడేనా పుట్టి వున్నారా? అనేదే నాశంక. వీరే అక్కఱలేదు విమర్శకుడుగారు తమకుఁదోఁచిన యేవిజ్ఞుల పేరులుదాహరించినాసరే, వారేశాఖ వారేనా సరే, యేకులంవారైనా (18 జాతులలో) సరే, ఆడవాళ్లేనాసరే, మగవాళ్లేనాసరే, ఆ తిట్లు తిట్లుకావనియు, అందులో అంతరార్థం సుపరీతార్థ మున్నదనియు "పదియవనాటి ముతైదువు" పుణ్యస్త్రీయే అనియు అర్థము చెప్పి విమర్శకుఁడు గారిని వొడ్డెక్కిస్తే నేను సంతోషిస్తాను. (యేదో? కాలకర్మ దోషంచేత కర్మం చాలక అలా నోరుకాదు చేయి జాఱింది అని క్షమాపణ (నాకుకాదు) లోకానికి చెప్పి నిర్దోషత్వాన్ని సంపాదించుకోక యింకా తగుదునంటూ యీ పిడివాదం యెందుకంటాను?) తగుదునని యింకా వ్యాసాన్ని వ్రాసి పత్రిక నిండిస్తూ తమ అనుచిత ప్రసంగాన్ని సమర్థించుకోవడానికి ఉపాయం కనపడక యితరులు విపరీతార్థం చేశారనిన్నీ"వెగటుగా వుండేటట్టు ప్రకటించా"రనిన్నీ అపవదించడం శోచనీయం కాదా? పైఁగా

శాస్త్రిగారి యుద్దేశమేమియో? నేనట్లు తమ్ము నిందించినట్లు లోకమునకుఁ దోఁపవలయునని కదా? (లోకానికి నిందించినట్లు తోఁచదు స్తుతించినట్టుగానే తోస్తుందేమి?)

ఈ వాక్యసౌడభ్యం చదువరులు గమనించాలి. శాస్త్రిగారియుద్దేశం శాల్జోడు సమర్పించుకోవడమే ముమ్మాటికిన్నీ అంతే. తిట్టనట్లుమాత్రం లోకానికి తోఁచకుండా శాస్త్రిగారు చేయాలి. చేయగలరా? తిడితేమాత్రం 76 సంవత్సరాల బ్రాహ్మఁడుగదా! యెందుకు పడఁగూడదూ? అంటాను పైఁగా అంతకంటె అనఁగా తిట్లకంటె అధిక పాండిత్యం పూర్ణానుస్వారంగా వుండి విమర్శనకు పూనుకొన్నవృద్దులు తిడితే మాత్రం నోరుమూసుకూరుకోవాలిగాని అయ్యా! చూడండని వారితోను వీరితోను చెప్పకోవడం కూడానా? యెంత ఘాతచేశాఁడూ. వెం. శా, (ముదిమి రెండవ బాల్యంబు కదా) అవును తప్పే. దాన్ని వారించుకోవడానికేకదా? శ్రీవారిని శాల్జోడుతో అభినందన పద్యాలతో