పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/540

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

544

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


ధర్మాలుగాని మార్పుచెందవన్నది సర్వానుభవసిద్ధం. అకారణంచేత మొగం చెల్లక వారు నిరసించారు గాని మఱోటికాదు కనక మళ్లా వారిని ప్రార్ధిస్తాను. అయితే - “రానివారలన్ రమ్మని పిల్వ వేడుకనరా" అని నన్ను లోకం పరిహసిస్తుందేమో? వినండి ఆయన నన్ను తిట్టినా ఆదూషణాలు నాకు భూషణాలుగానే పరిణమించాయి. యీలాటి తిట్లకు వప్పుకోలేదుగాని కీ|| శే|| సోమంచి భీమశంకరంగారు (ప్లీడరు) అమ్మాఆలీ బూతులయితే ఆశీర్వచనాలే అని వొకప్పుడు చమత్కరించారు. యీతిట్లు లోకంలో యీలాటివా రుంటారని తెలుసుకోవడానికి అవకాశం గలిగి గురుత్వాన్ని కూడా చేసినట్లయింది. అందుచేత మొదట కొంచెం భారంగా కనపడ్డా, క్రమంగా అది చెడ్డపని అయినప్పటికీ, ముమ్మాటికికూడా చెడ్డపనేఅయినప్పటికీ దానివల్ల నాకుఁగాని, నాయశస్సుకుఁగాని, యిప్పుడు గాని, భవిష్యత్కాలంలోఁగాని జరిగే అపకారం యత్మించిత్తూ కూడా లేదని నాకు తోcచింది. దీన్ని లోకం యెంతవఱకు విశ్వసిస్తుందో నాకు తెలియదు.

“ఉత్పత్స్యతే మమ తు కో౽పి సమానధర్మా"

అన్నాఁడు భవభూతి. అలమతి విస్తరేణ. అందుచేత వారిని నేను కవితాధార సాఫుగా వున్నదనే గుణలేశాన్ని పురస్కరించుకొని తక్కిన దాన్ని సర్వమున్ను పొల్లుగా భావించి జల్లించి “తోసిరా” జని సమ్మానింప దలఁచినాను. యిప్పటికీ యింకా నాప్రయత్నం అమల్లోనే వుందిగాని “నిరాశాః పితరో గతాః" కాలేదు. వారితిట్లు సమర్థనీయాలు కావన్న సంగతి వారికి బాగా గోచరించినట్లు వారి యిటీవలి సశేష వ్యాసంలో వుండే అక్షరాలవల్ల వ్యక్తం అవుతూ వుంది. ఆ అక్షరాలు చూచాకే నేనీ వ్యాసాన్ని వ్రాయడానికి ఆరంభించాను. ఇంకా వారి వ్యాసం “సశేష" స్థితిలో వున్నా యొప్పటికప్పుడే జీవితసంశయంలోవున్న నేను రాఁబోయేవారివ్యాసశేషం చూడకుండానే, “మీగాళ్ల" సామెతగా భవిష్యత్తులో రాఁబోయేవారి మాటలను భావనాశక్తిచేత (కవులకు భావనాశక్తి చాలా సంగతులను గోచరింపఁ జేస్తుంది). వూహించి మళ్లా యీ ఆహ్వానాన్ని పంపుతూన్నాను. ఇది విషయాంతరం. వారి వ్యాసంలో వున్న యీమాటలు వారికి వారితిట్లను సమర్థించుకునే వుపాయం లేక నీళ్లు నమలవలసి వచ్చిందన్నసంగతిని తెలుపుతాయో! లేదో! చదువరులకు తెలియడానికి వుదాహరిస్తూవున్నాను.

“31 సంఖ్యగాఁ గొన్ని పద్యములు వెగటుగాఁ గనపడునట్లుటంకించి కొంత విపరీతార్ధము చేసి వ్రాసియున్నారు. శాస్త్రిగారి యుద్దేశమేమియో? నేనట్లు తమ్ము నిందించినట్లు లోకమునకుఁ దోఁచవలయుననికదా? కానిండు నా గ్రంథమామూలాగ్రము చదివినవారికైన సత్యము తెలియఁబడదా?” అని వ్రాయ మొదలిడినారు. నేను చేసిన