పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/539

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

“శుభస్యశీఘ్రమ్”

543

“క. అపకారికి నుపకారము నెపమెన్నక సేయువాఁడు నేర్పరి సుమతీ.”

అనే పద్యాన్ని స్మరించి ఆరీతిగా యీయన అనుగ్రహాన్ని సంపాదించుకొందామని ప్రయత్నించాను. ఈనాప్రయత్నం కూడా విఫలమే అయింది. విమర్శకుఁడుగారు దీన్ని అవమానంగా భావించారు. లోక మేలా భావించిందో? చూడండీ, చాలా వుత్తరాలున్నా వక్కపిల్లకవి వత్తరంలో నుంచి కొన్ని మాటలు మాత్రమే వుదాహరిస్తాను.

గునపఱ్ఱు, తాడేపల్లిగూడెం పోష్టు,

24–05–1939.

మానాప్రగ్గడ శ్రీరామసుబ్బరాయశర్మ నమస్కరించి వ్రాసికొనెడి

విజపి :

"కృష్ణాపత్రికలో ప్రకటింపఁబడినవ్యాసము (నన్నయ్యనుగూర్చినది) చూచితిని. దేవీభాగవతపు విమర్శకుఁడుగారికి మీరిచ్చిన సమాధానము చదివితిని. వారు పశ్చాత్తప్తులు కాకపోరని నానమ్మకము. ఏమందురా?

“క. తిట్టినవారల మరలం
     గట్టలుకం దిట్టఁబోక కానుక లఱుతం
     జట్టఁగఁ జూతురు శాంతముఁ
     బెట్టెనె? మీ యమ్మ ఉగ్గుఁ బెట్టెడివేళన్."

నాకాశ్చర్యమైనది. ఇట్టి శాంతయుతుని ప్రేరేపణ లేకయే మీకృతి కర్తగారికి (మానియోగితల్లజునకు) కవిలోకమే సమాధానమీయఁగలదు.

చేవ్రాలు.

అనేకులు కవులు, అడ్వకేట్లు (ఇందుఁ గొందఱు వాచా అభినందించినవా రున్నారు.) ఉద్యోగులు (వీరందఱు నియోగులే) నాపూనికను అభినందించిన వారుగలరు. అసలు . వారూ వీరూ యెందుకు బోధించాలి. విమర్శకుఁడుగారి వార్ధక్యం బాగానే వుండి నలుగురి నోళ్లల్లో పడవలసిన ప్రాప్తి లేకపోతే వారివృద్ధత్వమే వారిని బోధించేది. “అవశ్య మనుభోక్తవ్యం కృతంకర్మ" నిరసించినవారల్లా నేనెవరిని ఆతిథ్యమునకై ఆహ్వానించితినో వారు మాత్రమే అయితే, వారికి మనస్సులో అన్ని అనుచితమైనతిట్లు తిట్టి యేలావెళ్లి వానిసత్కారాన్ని స్వీకరించేది అనే సంశయం కలగడంలో ఆశ్చర్యం వుండకూడదు. అది మానవసహజమైనధర్మం. ఎంతకోపం లోపల వున్నా శారీరక ధర్మాలుగాని, మానసిక