పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/537

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

“శుభస్యశీఘ్రమ్”

541


అందుచేత యితరులకు బరాతం పెట్టడం కూడా అనవసరమే అనిన్నీ అసలు విమర్శకుఁడు గారికే బరాతం పెట్టడం యుక్తమనిన్నీ యిప్పటికి తేలింది. అయితే ఆయన యెఱిఁగేవంటే? వాట్లనుగూర్చి మళ్లాయెందుకు ప్రశ్నిస్తారు? అంటే వున్నదంతా దానిలోనే వుంది కుల్లస్సు. ఆప్రశ్నించడమే అత్యాశ్చర్యం. ఆశ్చర్యంలోనున్నూ ఆశ్చర్యం. ఆరోజుల్లో యీవిజృంభించడం బొత్తిగా కనపడక యిన్నాళ్లకి విజృంభించడాని కారంభించడం యింకోటి. కాశికావృత్తికంటె కౌముదే యెందుకు పూర్వం కాకూడదని మొదట ప్రశ్నించి, తరువాత ఆప్రశ్నించడం బొత్తిగా అనభిజ్ఞత్వప్రయుక్తమని నేను సూచించినతర్వాత యిప్పటివ్యాసంలో అపూర్వత్వం గుంటూరిసీమ గ్రంథంలో వున్న నావాక్యాధారం మీఁదే సమర్ధించఁబడుతుందని వుబలాటపడటం యింకోటి. శాంతం పాపం! దీన్ని గుఱించి కొంచెం వ్రాస్తాను. వీరేవాక్యం భ్రమపడి దానికి ఆధారమవుతుందను కొన్నారో! ఆవాక్యం వీరు వుదాహరించినప్పుడు దానితత్త్వాన్ని బోధపఱుస్తాను. యిప్పటికి వారిసంతోషాన్ని అలాగే వుండనిస్తాను. బొత్తిగా శాస్త్ర సంస్కారం లేనివారు యేవో ప్రశ్నలు కూరగాయప్రశ్నలువేసి చాలించక యీబాధకూడా యెందుకో, "బుద్ధిః కర్మానుసారిణీ" మీసపు శంక వదిల్చినట్లయింది. యద్వా మీసం నేను మాత్రమే పెంచి తిరుపతిశాస్త్రి పెంచనేలేదని వాదసౌకర్యార్థం క్షణకాలం వప్పుకుని మాట్లాడుకుందాం. అప్పుడు మాత్రం “పెంచినారము" అని చెప్పఁగూడదా?“అస్మదోద్వయోశ్చ" అనేది యేమవుతుంది? యింకా వాదం సాఁగితే వీరు యింకో ప్రశ్నవేస్తారని తోస్తూవుంది. అది యిది.

“మీరిద్దఱూ జంటకవులు గదా? తిరుపతిశాస్త్రి యిప్పటికి సుమారు 20 యేళ్లనాఁడే దేహం చాలించాఁడు కదా? నీవింకా దిక్కుమాలిన వ్యాసాలు వ్రాస్తూ వొక్కినరంలాగ జీవించి వున్నావేమీ, మాయిష్టం వచ్చినట్లల్లా మమ్మల్ని వ్రాసుకోవడానికి అభ్యంతరం కల్పిస్తూ" అనేది కూడా వొకప్రశ్నలోకే చేరుతుందనుకోవడాని కభ్యంతరం వుంటుందా? యీవిమర్శకుఁడుగారి ప్రశ్నలధోరణి చూస్తే, ఆలాటిప్రశ్న వేస్తారా? విమర్శకాగ్రణిగారు. యిదివఱలో వేసినప్పటికీ యిప్పుడు కొన్ని బిరుదులు పొందివుండికూడా వేస్తారా? అలాటి ప్రశ్న అంటే? యిప్పుడు వేయరేమో కాని మునుపు వేయడాని కభ్యంతరం లేశమున్నూ లేదని మనవిచేస్తూ అలాటిప్రశ్నలే వీరు వేసినట్లు యిక్కడ మఱివకటిచూపి ఋజువు చేస్తూన్నాను. దేవీభాగవతపద్యం వీరివిమర్శన కంతకూ ఆయువుపట్టు పద్యం- “క. ఎన్ని పురాణమ్ములు" అన్నది లోcగడ వుదాహరించే వున్నానుగదా! అందులో యీయన చేసినశంక యేలాటిదో? గమనించండి. అరణ్యపర్వం తెలిగిస్తూ చచ్చిన నన్నయ్య "యేలా నీవిచ్చేమెచ్చు పరిగ్రహించడానికి అర్హుఁడైనాఁ"డనికదా? ప్రశ్నించారు విమర్శకాగ్రణిగారు. ఈయన భాగవతం యెప్పుడేనా ఆఖరికి కృత్యాదిపద్యాలేనా చదివి వుంటారో? లేక