పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/520

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

524

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


అనే న్యాయాన్ని పాటించిన తిక్కన్నగారు భారత మనాయాసంగా రసవత్తరంగా పూరించి తద్ద్వారాగా తాను తరించడమేకాకుండా నన్నయ్యగారిని కూడా తరింపచేశారనుటకు సందేహంలేదు. తిక్కన్నగారి విజ్ఞానం నన్నయ్య గారినికూడా కూడతీసుకురావడం లోనేవుంది. దీన్నిగుఱించి లోగడ వ్రాసేవున్నాను. అందఱు యెఱిఁగిందే అయినా తిక్కన్నగారిశైలికూడా కొంతమచ్చుచూపి యీ వ్యాసాన్ని ముగిస్తాను-

ఉ. చిచ్చఱకన్ను మూసికొని చేతిత్రిశూలము డాఁచి లీనమై
    వచ్చిన రుద్రుచందమున వ్రాలుదు వీవనిలోన నోర్వఁగా
    వచ్చునె నిన్ను నెట్టిమగవానికి నీకృప నాశ్రయింపఁగా
    వచ్చితి మెవ్విధిం గెలువవచ్చు మహాత్మ యెఱుంగఁ జెప్పవే,

క. సంజయ మురభంజనుని ధ
   నంజయునిం జీరికిం గొనఁడు కర్ణుం డిం
   ద్రుంజెనఁకియైన గెల్లున
   నుం జచ్చెనె అట్టివాఁడునుం గయ్యమునన్.

క. పలపలనిమూఁకలోఁ గా
   ల్నిలువక గుఱ్ఱమ్ముడిగ్గి నీకొడుకు గదా
   కలితభుజుఁడగుచు నొక్కఁడు
   తొలఁగి చనియె నేమిచెప్పుదున్ గురునాథా,

యిట్టివి విడివిడి పదాలకూర్పుతో ముద్దులు మూటగట్టేశైలిలో వున్న పద్యాలెన్నో వుదాహరించవలసి వుంటుంది. యీశైలికి కూడా మార్గదర్శి నన్నయ్యగారే యేమో అని నే ననుమానిస్తాను.

తిక్కన్నగారి పద్యాలలో తెలుఁగెక్కువ సంస్కృతం తక్కువ. నన్నయ్యగారి పద్యాలలో సంస్కృత మెక్కువ తెలుఁగు తక్కువ, అని వ్రాయనక్కఱలేదు. కాని శైలి వుభయులదిన్నీ ప్రసాద గుణభూయిష్టమే. నెల్లూరు, గుంటూరు, బందరు ప్రాంతాలలో వున్నంత అచ్చతెలుఁగు గోదావరీ మండలంలో వాడకంలో లేదనే నాకు తోస్తుంది. కాని నన్నయ్యకెక్కడి నుండి వచ్చాయో మాఱుమూల తెలుఁగుపదాలుకూడా కవిత్వంలో దొర్లుతాయి. ఏడైఱ, ఒగి, వెస, మొదలైనమూటలు వ్యావహారికంలో నేనెక్కడా మా ప్రాంతాలలోcగాని యితర ప్రాంతాలలోఁగాని వినలేదు. భారతకవుల కెక్కడినుండి వచ్చాయి? గ్రాంథికంగా వున్నాయంటే నన్నయ్యగారి నాఁటికి వున్న గ్రంథాలపేళ్లు