పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

56

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


ప్రమేయమే లేనివారు. కాcబట్టి యీ సందర్భంలో వీరికీ వారికీ తారతమ్య నిర్ణయం చేయనక్కరలేదు. కృష్ణమూర్తిగారు పిఠాపురపు సంస్థానంలో వకప్పడు విజయదశమీ నిర్ణయములో సంస్థానపురోహితులద్వారా పాపయ్యశాస్రులగారి నధః కరిద్దామనే కుతూహలంతో పాపయ్యశాస్తులుగారి నిర్ణయానికి వ్యతిరేకంగా పురోహితుడిచేత వాదింపచేయడానికి పూనుకొని తాను కవి కనుక ధర్మశాస్త్రశ్లోకాలు తదనుగుణంగా పాతతాటాకు సంపుటాల్లో యొక్కించి రాజసభలో కనపరచేటప్పటికి శ్రీ రాజావారు పాపయ్యశాస్రుల్లుగారికేసి చూచి “దీనికేమంటారు” అని ప్రశ్నించేటప్పటికి శాస్రుల్లుగారు “మహా ప్రభూ : శ్రీకృష్ణ సాహాయ్యమండి" అని శ్లేషగా జవాబు చెప్పేరంట. దానిమీంద కృష్ణమూర్తిగారు పాపయ్యశాస్రులుగారి పేరును శ్లేషిస్తూ “మహాప్రభూ! పాపుcడికి కృష్ణసాహాయ్యముండదని Ꮛ8ö❍°ᏋᏇᏇ చెప్పేరట. అంతతోకూడా వూరుకోక కుమారసంభవంలో శ్లోకాన్నొకధాన్ని యెత్తికొని ప్రస్తుతాని కనుకూలించేటట్టు అర్థం చెప్పి కాళిదాసుకూడా యిదే అభిప్రాయం కలవాండని చమత్కరించినట్లు చెప్పంగా విన్నాను. యీగాథలన్నీ నాకు తు చ తప్పకుండా వచ్చివున్నప్పటికి గ్రంథవిస్తరభీతిచేత స్పృశించి మాత్రం వదులు తున్నాను. యీ పిఠాపురంలో వీరిద్దటికీ వైషమ్యానిక్కారణం శ్రీ రాజావారు పాపయ్యశాస్రుల్లు r্য০63 పద్దెన్మిదిపుట్ల భూమి యివ్వడమున్నూయి. సంగతి విని అంతకుముందు సుమారు పద్దెన్మిదేండ్లనాడు శ్రీ కాకర్లపూడి సంస్థానం విచ్ఛిన్నమయ్యే రోజుల్లో A. శ్లో "త్రిస్థలీధ్వంసనార్ధాయ ప్రవిష్టం నాయనత్రయం తతైకస్తుకృతార్టో భూ దన్యౌద్వౌతు భవిష్యతః" అని భావికాలాన్ని సూచనచేసి కాళహస్తి సంస్థానానికి సకుటుంబంగా వెళ్లివున్న కృష్ణమూర్తిగారు భూసంపాదనేచ్ఛతో శ్రీ పిఠాపురం రాజావారి దర్శనానికి రాంగా రాజావారు రు. 500-0-0లున్నూ విలువగల సేల్లోడుమాత్రమే యిచ్చి సత్కరించడంవల్ల, నేనేం తక్కువవాండనా? పాపయ్యశాస్రుల్లు కిచ్చినట్లు నాక్కూడా భూమి యేల యివ్వకూడదు? అనే యీర్యతో రాజుగారికి తన గొప్పదనాన్ని చూపడానికి కృష్ణమూర్తిగారు రాజపురోహితునిచే పాపయ్యశాస్తుల్లుగారి నిర్ణయానికి అన్యథాగా చెప్పించారనిన్నీ దానిమీంద పైన వుదాహరించిన శ్లేషప్రసంగం జరిగిందనిన్నీ స్పష్టమేకదా! ООЈОSS OЈо సందర్భంలో కృష్ణమూర్తిగారు శ్లేషగా చెప్పిన - "శ్లోరావురామనృపతౌ" అనే శ్లోకాన్ని వుదాహరించి చర్చించవలసియున్ననూ మనకు ప్రధానం పాపయ్యశాస్రుల్లుగారిది కూడా కాక వేంకప్పసోమయాజులుగారి విషయ మవడంచేత వుపేక్షిస్తున్నాను. ప్రసక్తాను ప్రసక్తమైనప్పటికీ పాపయ్యశాస్రుల్లుగారి చరిత్రకూడా కొంత మనకు ప్రధానమే అన్న అంశం ముందు వ్రాసే సంగతినిబట్టి చదువరులకు గోచరిస్తుంది. యింతకున్నూ -