పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/517

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నన్నయ్యభట్టు

521


చిరకాలమునుంచి తుల్యావస్థలోనే వున్న నాకు కృతి ప్రదాతను సమ్మానించినాఁడన్న యశస్సును సంపాదించి పెట్టవలసిందని ప్రార్థిస్తూన్నాను. ఆ సమ్మానసభలోనే వారికి అంగీకారమైతే వారిశంకలకు కూడా సరళంగా తోcచిన సమాధానాలుకూడా చెప్తాను. నన్నయ్యను గూర్చిన శంకలవంటివే అయితే చెప్పనే అక్కఱలేదుకదా? ఆయీ సందర్భం వారి అంగీకారానంగీకారాలను బట్టి వుంటుంది. బలవంతంలేదు. యీయన కవితాధారనేకాక శాఖాభిమానాన్ని కూడా చదువరులు ప్రశంసింపవలసి వుంటుందని నాతలఁపు. తిట్లకేమి అవి యీయనవి కావు కోపానివి. యిఁక యీలాటి సందర్భం వకటి నిమిత్తంగా పెట్టి యీ విమర్శకుఁడు గారిచేత నన్ను కృతినాయకుణ్ణిగా చేసిన నన్నయ్యభట్టారకుని అనితరసాధ్యరచనకై కొన్ని పద్యాలు చవిచూపుతూ తోcచినమాటలు కొన్నివ్రాసి ఈ వ్యాసం ఆఁపుతాను.

చ. బహువనపాదపాబ్ధికులపర్వతపూర్ణసరస్సరస్వతీ
    సహితమహామహీభరమజస్రసహస్రఫణాళిఁదాల్చి దు
    స్పహతరమూర్తికిన్ జలధిశాయికిఁ బాయక శయ్యయైన య
    య్యహిపతి దుష్కృతాంతకుఁ డనంతుఁడు మాకుఁ బ్రసన్నుఁడయ్యెడున్.

చ. అరిదితపోవిభూతి నమరారుల బాధలు వొందకుండcగా
    నురగులనెల్లఁ గాచిన మహోరగనాయకుఁ డానమత్సురా
    సురమకుటాగ్రరత్నరుచి శోభితపాదున కద్రినందనే
    శ్వరునకు భూషణంబయిన వాసుకి మాకుఁ బ్రసన్నుఁ డయ్యెడున్.

ఉ. గోత్రమహామహీధరనికుంజములన్ విపినంబులన్ గురు
    క్షేత్రమునన్ బ్రకామగతి ఖేలన నొప్పి సహాశ్వసేనుఁడై
    ధాత్రిఁ బరిభ్రమించు బలదక్షపరాక్రమదక్షుఁ డీక్షణ
    శ్రోత్రవిభుండు తక్షకుఁడు శూరుఁడు మాకుఁ బ్రసన్నుఁ డయ్యెడున్.

యిట్టి ధారాశుద్ధికై నేను బాల్యమాదిగా ప్రయత్నించి చూచాను. అలవడింది కాదు. యీభట్టారకుఁడు స్వల్పంలో తేలేదాన్ని పెద్దచేసిన్నీ చెప్పఁగలఁడు. పెద్దలో చెప్పేవిషయాన్ని క్రోడీకరించిన్నీ చెప్పఁగలఁడు. కర్తు మకర్తు మన్యథాకర్తుం సమర్థుఁడు. దీనికి వుదాహరణాలుగా కొన్ని పద్యాలు భారత విశేషాలలో యెప్పుడో చాలానాళ్లక్రితమే చూపివున్నాను. "జలధివిలోలవీచివిలసత్కలకాంచి" లోనైనపద్యాలు చూచుకోవాలి. ఆయీశక్తులన్నిటిలోనున్నూ నాకు అనితరసాధ్యంగా తోఁచింది యీతని సమాసగ్రధన