పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/513

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నన్నయ్యభట్టు

517

(19) “క. ఇద్దఱు భోక్తల కెక్కువె?
           తద్దినమని యిదియె మీకుఁ దగునుపమ..."

(20) "తే, గీ. గంటకేఁ బది (10) పద్దెముల్ గెంటలేని - నీకొలఁదికి...”

(21) “ఉ. ...చచ్చి చెడంగలార లొక జామల తిర్పతి వేంకటేశ్వరుల్,"

(22) “తే. గీ. కొత్త విశ్వస్తలన మూలఁ గూరుచుండి...”

(23) “తే. గీ. అరయఁ బదియవనాcటి ముత్తైదువలన--

(24) “ఆ. వె. సభకుcబోయి చూడఁజాలనిమీరు--

(25) “తే, గీ. బుఱ్ఱగొఱిగించి సున్నపుబొట్లవెట్టి
                తిరుపతిని వెంకటన్నను ద్రిప్పినాము"
                (ఇది సొంతతిట్టుకాదు, ఇతరానుకరణము)

(26) “చ. -పదియవనాఁటి యైదువలభంగి నడంగరె?"

(27) “చ. ...నక్కపోతు నే-నని యుపమించుకొ
            మ్మదియె యన్ని విధంబుల సార్థకంబగున్."

(28) “క. .వెంగలితన మింకఁ గలదే! వేంకటశాస్త్రీ."

(29) "తే, గీ. ...పందవై పాఱుటది యొకబంటుతనమె?"

(30) "క ...నీ వీ వెడపోకలఁ బోయితె? ద్రావిడ యుక్తులన..."

(31) “చ. పయోధరములు చిమ్ముకొంచరుగు ద్రావిడభామలచందము,”
           (విమర్శనములో ద్రావిడస్త్రీల పయోధరాల జోలి యేటికో)

యెన్నని చూపుదును? యిదేరీతిని నూటపదహారు డెమ్మీసైజు పుటలు తి. వెం. కవుల గ్రంథవిమర్శన మనే పేరుతో నొకరు పద్యాలతో పూరించినారు. వారు మమ్మిట్లు తిట్టుటకు ప్రధానహేతువు నన్నయ్య భట్టును మేము మా దేవీభాగవత పీఠికలో -"లక్షణంపుఁబ్రోవై" అని సంభావించినందుకున్నూ, ప్రప్రథమకవిగా అతణ్ణి సమ్మానించి నందుకున్నూ అనుకోవడానికి పయినచూపిన వాక్యాలలో యెన్నో ఆధారాలున్నాయి కదా? కాని మొట్టమొదటనే ఆ విషయం యెత్తుకొని కొన్ని తిట్లుతిట్టడంచేత స్థూలదృష్టికి అందుకోసమేమో అని మాత్రం తోస్తుంది. అయితే యింకావున్న తిట్లకు ఫలితాన్ని విచారించవద్దూ, వినండి, అసలు మా గ్రంథాలు విమర్శించడానికిన్నీ పూనుకున్నట్లులేదు. విమర్శకుఁడు గారికి మా మీఁద వచ్చిన కోపమంతా "గుంటూరు సీమ"కు సంబంధించినదే.