పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/510

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

514

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


వదులుకొని విమర్శించడానికి దిగితే సమర్ధించడం కష్టసాధ్యమే అవుతుంది. యీశ్లోకం పేరెందు కెత్తవలసి వచ్చిందంటే గుంటూరు డి|| విమర్శకులు దీని సజాతీయమయిందే మాపద్యం వకటి లక్షణాపరిణయంలోది యెత్తి యేమేమో వ్రాసివున్నారు. ఆయనకు దీనిద్వారా తెల్పడానికే. చాలా ఉదాహరణలు చూపవలసి వున్ననూ, అందుకోసం యీవ్యాసం వ్రాయడంలేదు గనక ఆ విధానం యిక్కడ కొంత ప్రస్తుతమైనప్పటికీ వుదాహరించి చూపలేదు. "శ్లో అస్మాన్ సాధు విచింత్య" అన్నశ్లోకంమీఁద సుమారు 16 యేండ్లనాఁడు నా వికటవిమర్శన చాకచక్యాన్ని ఒకరికి చూపి ఉన్నాను. కావలసినవారు దాన్ని చూడండి. పూర్వకాలంలో కూడా యీశాఖాభిమాన ప్రయుక్త పక్షపాతాలున్నూ ద్వేషాలున్నూ వున్నట్టు అడిదం సూరకవిగారికిన్నీ సోమకవిగారికిన్నీ జరిగిన యుక్తిప్రయుక్తి ప్రసంగంలో సోమకవిగారుచెప్పిన- క. పలుకుల చిలుకల కొలికీ- అనేపద్యం సాక్ష్యమిస్తుంది. కాని అంతకుమించినసాక్ష్యం మఱేది కనcబడకపోవడంచేత యీ శతాబ్దంలో వున్నంత శాఖాభిమానాలు, లేక, ద్వేషాలు అప్పుడు లేవనియ్యేవే మనం అనుకోవచ్చును. నన్నయ్యయందు తిక్కన్నగారికి యెంత గౌరవమో వుండడానికి ఆయన తెనిఁగించినంత మట్టుకు భారతం అలాగే వుంచి తరువాయి అందుకొని ఆంద్రీకరించడమే సహస్రముఖాల వ్యక్తం చేస్తుంది. పదిహేను పర్వాలు అవలీలగా తెలిఁగించిన తిక్కన్నగారికి ఆమూఁడుపర్వాలున్నూ మూcడునెలలలో తెనిఁగించడానికి చేతకాకపోతుందా? అంతేకాదు, ఆపర్వత్రయమున్నూ తిక్కన్నగారు మళ్లాతెలిఁగించేయెడల రసవంతంగా వుండడానికి అభ్యంతరం వుండకపోవచ్చునుగాని నన్నయగారిశైలి అనితరసాధ్యమవడంచేత ఆ విషయంలో ఇటీవలి కవులు యెక్కువగా వాదోపవాదాలకు దిగవలసివచ్చేదనుటకు సందేహంలేదు. వొకరు ముందుగాచేసిన పనినే వేఱొకరు చేసేయెడల యేవో కొన్ని భాగాలు ముందువారివి అదివఱకే శ్లాఘ్యతరంగా వుండే పక్షంలో యిటీవలి వారి రచన అక్కడ తీసిపోక తప్పదు. సోమయాజులుగారు యీమాట మనస్సులో పెట్టుకొని ఆపర్వత్రితయంజోలికి పోలేదని యింతవఱకెవ్వరున్నూ వ్రాసినట్లు లేదు. నేనున్నూవ్రాయను. తిక్కన్నగారికి నన్నయ్యగారియెడల అపారమైన గౌరవమేగాని శాఖాద్వేషాదులేవిన్నీలేవు. అనియ్యేవే వ్రాస్తాను. ఆగౌరవం- “అందాది దొడంగి మూఁడుకృతులాంధ్రకవిత్వ విశారదుండు విద్యాదయితుం డొనర్చె మహితాత్ముఁడు నన్నయభట్టు దక్షతన్",

అనే వాక్యంవల్లనే గోచరిస్తుంది. అరణ్యపర్యశేషం జోలికి పోకపోవడానికి లోకంలో వున్నప్రవాదమే కారణమనుకుంటాను. నన్నయ్యగారి కవిత్వం సంస్కృత పదభూయిష్ఠంగా వుండడానికిన్నీతిక్కన్నగారిది ఆంధ్రపదభూయిష్ఠంగా ఉండడానికిన్నీ పలువురు పలువిధాల అభిప్రాయపడుతూన్నారు. నేను తెలుగు కనక “టీకా౽పి సంస్కృతమేవ" అన్నట్లు