పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/507

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నన్నయ్యభట్టు

511


చ. క్రమమది లేని యీనుడుల గౌరవమందెదవయ్య?... నీవచించువా
    క్యములవియెల్ల వేదములుగా గ్రహియింతురె! పండితోత్తముల్,

మాయం దీమహనీయుఁడి కింతకోపం యెందుకో? యెవరుముందు తెలిఁగిస్తే వచ్చే ఆధిక్యం యేమిటో వొకరిది వొకరుచూచి తెలిఁగించారని ఋజువుచేసి నిందిస్తే యింకా కొంత బాగుండేదేమో? మాలోమాకేమేనా వైషమ్యాలున్నాయా? వుంటే శ్రీరామకవిగా రీక్రిందివిధంగా యెందుకురాస్తారో ఆలోచించండి ప్రాజ్ఞులారా?

చ. తిరుపతివేంకటేశ్వరసుధీమణులన్ గొనియాడి మొక్కెదన్
    సరసులు నాకు మిత్రులును సర్వజనస్తవనీయ పాండితీ
    భరితయశుల్, తెనుంగునను భాగవతంబురచింపఁబూని రం
    చెఱిఁగితి వారివల్న, గణియింపరు నాయపరాధపుంజమున్.

ఆయీ పద్యతాత్పర్యాన్ని విమర్శకుఁడుగా రేలాచేసుకొని మమ్మల్ని అపవదింప మొదలుపెట్టారో నాకు లేశమున్నూ బోధ కావడంలేదు. "అన్యబుద్ధి అప్రత్యక్ష" మంటారు యిదే కాఁబోలు. దిక్కుమాలినప్రప్రథమత్వం, దీనికోసం యింత తగవెందుకు? ఉత్తరరామాయణాన్ని సోమయాజిగారు ఆంద్రీకరించారు. తరవాత చాలాకాలానికి దాన్నే పాపరాజుగా రాంద్రీకరించారు. ప్రప్రథములు తిక్కన్నగా రవడంచేత పాపరాజుగారి కవిత్వానికేమేనా గౌరవం తగ్గిందా? అందుచేత విమర్శకుఁడు గారేదో కోపం మనస్సులో పెట్టుకొని యేవిధమైనవైషమ్యాలున్నూ యెన్నఁడున్నూ లేని మామామధ్య పొరపొచ్చెములు కల్పించి మమ్మ దూషిస్తున్నారేకాని అన్యంకాదని మనుష్యమాత్రులకు గోచరించే విషయమే కనక విస్తరించేదిలేదు--

బ్రతికివున్న నామీఁదేకాదు యెన్నడో చచ్చి స్వర్గమలంకరించిన నన్నయ్యమీఁద కూడా విమర్శకుఁడు గారికి విపరీతమైన కోపమే వుంది. యీపద్యాలు చూడండి

“చ. మొదలిడి భారతంబు తుద ముట్టకముందె యరణ్యమందుఁ గ్రుం
     కి దివియలంకరించుపనికిం జనునన్నయ మీకుఁ దా దయ
     న్వదలిన దెట్టులయ్యెనది వాకొనె దాతనిపేరు గ్రుచ్చి, నీ
     మది కిది తోఁచె నౌ దురభిమానికి యుక్తము లెట్లుదోఁచెడిన్"

చూచారా? మేము నన్నయాది మహాకవులు మాకు తెలిఁగించుకొనడానికి యీదేవీభాగవతాన్ని దయచేత వదలిపెట్టారనడం విమర్శకుఁడుగారికి యెంత అపరాధంగా తోఁచిందోఁ యీ కారణంచేత నేను “దురభిమానిని"గా వారికి తోఁచి చీవాట్లు పెడుతూ