పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/505

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నన్నయ్యభట్టు

509


వెనుకటి వారికి అవి దొరికితే మాకివి దొరికాయని ఆయనకు తోఁచడాని కేదోకారణం వుంటుంది. ఆకారణం క్రమంగా ముందుముందుగోచరిస్తుంది. కనకవిస్తరించేదిలేదు. రచనావిషయాన్ని అనుకరించడంలో మాకునన్నయగారికంటె తిక్కన్నగారి యందే యెక్కువ గౌరవ మనేసంగతి మాభారతనాటకాదులు చదివినవారికి గోచరమే కనక విస్తరించేదిలేదు. దేవీభాగవతరచనలో కూడా మేము తిక్కన్నగారిశైలినే వరవడిగాఁ బెట్టుకున్నాము. యెంతవఱకు కృతార్థులమైనామో అది లోకం తేల్చవలసినవిషయం గాని మావిషయం గాదు. శ్రీనివాసవిలాసపీఠికలో-

“విరచించినారు దేవీభాగవతమును దిక్కన్నశైలిగాఁ దెల్గుబాస”

అనియ్యేవే వ్రాసియున్నాము. తి. వెం. కవులెక్కడ తిక్కన్నగా రెక్కడ? నక్కెక్కడ? దేవలోకమెక్కడ? అనేవారికి మేము జవాబు చెప్పవలసివుండదు. యెవరినో వరవడిగా పెట్టుకోక యేలాగా తప్పదుకదా? అప్పుడుమాత్రం యీ ఆక్షేపణకు గుఱికాక తప్పుతుందా? అందుచేత కవిబ్రహ్మగారినే వరవడిగా పెట్టుకున్నామని మా మనవి. పోనీ ఆదికవిగదా? నన్నయ్యభట్టునే వరవడిగా పెట్టుకోరాదా? ఆలా పెట్టుకుంటే కొంత శాఖని గౌరవించినట్టుకూడా అవుతుందని యెవరేనా శంకిస్తారేమో? వినండి యథార్థాన్ని ఆంధ్రకవులలో యింతవఱకు నన్నయ్యధారాశుద్ధిని అనుసరించి కృతార్థులైనవా రెవరున్నూ నా బుద్ధికి కనుపించడంలేదు. ఆయనకవిత్వంలో తక్కినగుణగణాలాలావుండఁగా సమాసశైలి బహు అసాధ్యస్థితిలో వుంటుంది. దాన్ని అనుసరిద్దామంటే బొత్తిగా కొఱకఁబడదు. కొన్ని పద్యాలు వుదాహరించి చూపితేనేబాగుంటుందిగాని గ్రంథవిస్తరభయం బాధిస్తూవుంది. (1) కురువృద్దుల్ గురువృద్ధబాంధవు లనేకుల్ (2) మదమాతంగతురంగ కాంచనలసన్మాణిక్యగాణిక్య- లోనైన పద్యాలు యెన్నో వున్నాయి. చదువరులే పరిశీలించుకోవాలి. కొద్ది గొప్ప యీ సమాసధోరణి పెద్దన్నగారికవిత్వంలో కనపడుతుందని అన్యత్ర వ్రాసి వున్నాను. కాఁబట్టి యిక్కడ స్పృశించివిడుస్తూన్నాను. నా అభిప్రాయాన్ని బట్టి ధారాశుద్ధికి నన్నయ్యకు నన్నయ్యేకాని యితరులు దీటుకారనియ్యేవే. యితర గుణాలలో, యితరుల కవిత్వం నన్నయ్యగారిని మించుతుందంటే అది యథార్థమైనా, కాకపోయినా నేను వివధించేవాణ్ణికాను. నా యీ అభిప్రాయం లోకానికి యెంతవఱకు నచ్చుతుందో నాకు తెలియదు. యీ అభిప్రాయం నిన్న నేఁడు పుట్టిందికాదు. చాలా బాల్యంలోనే పుట్టింది. డెబ్బయో పడిపూర్తికావచ్చినా యిది మాఱినట్టులేదు. యిఁక ముందున్నూ మాఱుతుందని తోఁచదు. కొన్ని అభిప్రాయాలు వెనుక వకలాగువుండేవి. యిటీవల మఱివకలాగు మాఱిపోయాయి. అందులో మచ్చుకు వకటి వుదాహరిస్తాను. మను,