పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/500

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

504

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


“అబాంధవ" అని ఛేదించి దానిని "హే అబాంధవ!” అని సంబోధించునట్లు సమన్వయించి కొనినయెడలఁ గాళిదాసున కనభిప్రేతమగు రాజదూషణము సంఘటించును. అపుడు తక్కిన పదములకు సమన్వయమెట్లందురా? హేఅబాంధవ, త్వయి, కృతాం, అస్యాః స్నేహ ప్రవృత్తిం, అని సమన్వయము. అర్ధత స్స్యయ మేవేతి సంబంధ్యతే. మఱచితిని, "స్నేహప్రవృత్తిమ్" అనుచో నశ్లీలము వారించుటకై కాళిదాసునకు శిక్ష నుపపాదింపవలసి యున్నది. కనుక నతఁడిట, “స్నేహప్రసక్తిమ్ లేక ప్రసత్తిమ్” అని దిద్దికొననగు. ఇక్కడికి శ్లోకములోని సగము శాస్త్రులవారి ధోరణినిబట్టి విమర్శింపవలసి యున్నది. పిమ్మటఁ జూతముగాక. మొత్తముమీఁద గొన్ని యిట్టిదోషములున్నను నీశ్లోకము, చాల రసవత్తరమై వ్యాసవాల్మీకాదులకన్న నిక్కవి నగ్రస్థానమున నుంచుచున్నది. వారిప్పట్టున ననఁగా వ్యాసులవారిప్పట్టున నితనియొద్దసరస కవితావిధానమును నేర్చికోవలసియున్నది. ఇత్యాదులు కృష్ణరాయ శాస్త్రులవారి ననుసరించి నా వ్రాయు నక్కరములుగాని బుద్ధిపూర్వకముగా నేవ్రాయునవికావు. కావున నాపై నాగ్రహింపవలదని చదువరులను మరలఁబ్రార్థించుచున్నాఁడను. నే నిదివరలో "బాగుగనున్నదని మెల్లఁగా నొకమాట వ్రాసి జాఱవిడిచిన శాస్త్రులవారి “యార్థిక విమర్శనమెల్ల" పైదాని సజాతీయమే యనియు దానినెల్లఁ బ్రత్యక్షరమును విడఁదీసి విమర్శింప వలసివచ్చుచో నేను మరల జన్మించి వయస్సునుబొంది రావలసినదేకాని, యిపుడున్న శరీరబలము చాలదనియు నెంచి యట్లు జాఱవిడిచి శబ్దవిషయమునుమాత్రము చర్చింపఁబూనితినని పాఠకు లరయుదురుగాక. వీరి విమర్శనమున "అతి సర్వత్ర వర్జయేత్" అను నభియుక్తోక్తిని బొత్తిగా మన్నించుట వలనమును గన్పట్టదు. ఏ వెఱ్ఱిమొఱ్ఱిమాటలనో వ్రాయు మాకు భవభూతికన్ననుత్తమస్థాన మొసఁగిననెవరు సమ్మతింతురు? ఇక్కాలమునందలి యే కొందఱకన్ననో కొండొక మిన్నలుగా నేకొందఱో భావించుచున్న మమ్మును వ్యవహారభాషయగు తెలుఁగున “అందు ఒందుగా మార్చికొమ్మని" యన్న నెవరు సంతసింతురు? ఈ రెండును సంఘటింపనివియే, “కవయః కాళిదాసాద్యాః కవయోవయ మప్యమీ! పర్వతే పరమాణౌచ పదార్థత్వం వ్యవస్థితమ్." కావున శాస్త్రులవారి మెచ్చున కుబ్బి తబ్బిబ్బగుటగాని, నిరసనకుఁ చింతించుటగాని యొనర్చువారు, “పరమామాయికులని’ మాతాత్పర్యము. విస్తంచ మెందులకు? వారిడిన ప్రశ్నమున కుత్తరముగా “నాపాడుచేయు విధమును" జూపితిని. దీని నింక వారు బాగుచేయవలయును, చేయనే లేరనుకొందము. కాదు న్యాయముగనే సమర్థింతురనుకొందము. నేను వారి వ్రాఁతయందలి సారమునుగ్రహించి మిన్నకుండెదనా? ఏదో బదులని పేరుపెట్టి గిల్కుచునే యుందును. దీనికి నిర్ణేతలెవరు? ఈ యథాత్తువాదము నాఁగువారెవ్వరు?