పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/495

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పునఃపేషణము

499


“ఒందు, మీ యందుకంటెఁ జాల బాగు"
“బాగు గా దనియు మీరు చెప్పలేరు"

"ఇట్టిదే ఉగ్గణంచు అనుప్రయోగమును నుగ్గణంచుకంటె, ఉక్కణంచు అని యున్నఁజాల రమ్యముగ నుండునను నా యభిప్రాయము ముమ్మాటికిని నిల్చును. తిరిగి ముద్రించునపు "డుక్కణంచి" యని సరిచేయుఁడని ప్రార్థింతును".

అని వ్రాయఁగల్గుటకును నక్కజపడవలసి యున్నది. ఈ తుది “ప్రార్థింతును" అనుమాటకు సందర్భమునుబట్టి “శిక్షింతును" అని యర్ధము చెప్పికొనక తప్పదు. శాస్త్రులవారి కింత పట్టుదలయే యున్నచో నెత్తికొనవలసినచో టియ్యదిగాదు, కాదు, కాదు. వీరుచూపినను, జూపకున్నను విధిగా దిద్దికోవలసినస్థలములు గొన్ని కలవు. అందీ క్రింది పద్యమొకటి.

“తే. గీ. వీర చిత్రాంగద విచిత్రవీర్యులకు వి
        వాహ మొనరించితిని కష్టపడి జయించి"

ఇట్టిస్థల మేదేని జూపి శిక్షణతాత్పర్యముతో "బ్రార్థింతును" అని లిఖించినచోఁ దప్పక దిద్దికొందుము. అంతియ కాని మే మెట్టివారమైనను "శ్రీతిరుపతికవులు మహాకవులు" అని వ్రాయుచు నెందులకుంగొఱగానిచోట వృథాగా శంకను గల్పించికొని పని గల్పించుట “మహతాప్రయత్నేన లట్వాకృష్యతే" అనువాక్యమును జ్ఞప్తికిఁ దెచ్చుచున్నది. ఇట్లే తిక్కనాదులకుఁ గూడ వీరు సవరణల నుపపాదింపవలసివచ్చుచో నెన్నియో యుండెడిని. దిజ్మాత్రముదాహరింతును.

“చ. అది యొకఁ డేల... దుస్ససేనుదు ర్మద మడంగించి"
                                                          (భారత - కర్ణ - 1. ఆ)

ఈ వాక్యము సంజయునిది. కర్ణవధవృత్తాంతమును ధృతరాష్రునితోఁ చెప్పుసందర్భములోనిది. ఈదుస్ససేనుఁడు ధృతరాష్రుని కొమరుఁడు. దుర్మదుఁడే యగుఁగాక యతని చావునుగూర్చి యతనితండ్రితోఁ జెప్పనపు డిట్లు ప్రయోగించుటకు శాస్త్రులుగారొప్పికొందురో? సవరణనుపపాదింతురో? ప్రత్యేకించి కనుఁగొనవలసియున్నది. కావునఁ జదువరులు జ్ఞప్తియందుంచికొనఁ గోరెదను. ఒకటి రెండు విషయములకు మాత్రమే యిప్పుడు పునరుక్త మైనను గొంత పెంచి వ్రాసితిని. ఇట్లే యింకను “తీఁత, దూఁత" లోనగు దత్తోత్తరములకు మరల వీరు ప్రశ్నించి యున్నారు. వ్రాసినచోఁ బెరుఁగును.