పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/494

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

498

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


విశేషప్రతిపత్తిః" అనుపరిభాషను జదివియున్నవారే కదా? ఎవరో ప్రశ్నించినట్లు ప్రశ్నింపనేల? దిద్దుఁబాటు నుపదేశింపనేల? మంచిది వ్యాఖ్యానముతో నవసరములేని త్రోవను వీరుపదేశించిరి కదా? యని “అందు, బిందుగా" దిద్దితిమే యనుకొందము. వేఱొకరు “పాండుతనూభవులు” అనునదికూడ వ్యాఖ్యానము నపేక్షించెడిదియే కావున నా పదముకూడ నిఁక నొకలాగు మార్చవలసియుండు ననునెడల గతి యేమి? ఇక్కడ వ్యాఖ్యానాపేక్ష యెట్టిదని యడుగుదురా? బోలెఁడు కలదు.

“తనూభవశబ్దము" ఔరసపుత్రబోధకము. వ్యత్పత్త్యర్ధమటులుండఁగా వీరొకరు గాకున్న వేఱొకరేని "అట్టివారు కాకుంటచే" కొంత ధర్మశాస్త్రసాహాయ్యము నపేక్షించి "సహోడుం డౌరసునివంటివాఁడే" యని వ్యాఖ్యానము చేయవలయునుగదా? "పార్థులు” అని ప్రయోగించినచో వ్యాఖ్యానముతో నక్కఱయుండదు. అగునేని పాదపూర్తికిఁ గొన్ని యక్కరములు లోటగు నందురా? “చ వై తుహి, చ వై తుహి” అనునట్లేవో మన కాంధ్రము నందును గొన్ని కలవుగాన వానినుపయోగించి యా లోపము తీర్చికోవచ్చును. కాని “భక్షితే౽పి లశునే" అను న్యాయముచే నిప్పుడుగూడ వ్యాఖ్యానాపేక్ష తప్పదేమో కదా? ఇందేగురలో మూఁగురు మాత్రమే, కుంతీపుత్రులగుటచేఁ జిక్కు వచ్చును. పైఁగా “నకులసహదేవులు” ప్రస్తుతవిషయమున నుదాసీను లని తేలినచో వారిసోదర సౌహార్దమునకుఁ గూడ భంగము కలుగఁ గలదు. దానినిఁ దొలఁగించుటకు మరల భారతమును వెదకి వ్యాసనన్నయతిక్కనాదుల కౌంతేయపదప్రయోగములను సోదరపంచకవాచకములను జూపవలసివచ్చును. ఇట్లెట్లో సమర్ధించి పార్ధప్రయోగము నిల్పుటకన్న నీ వ్యాఖ్యానములోఁ గొంత భాగము నుపయోగించికొని “పాండుతనూభవ". ప్రయోగమునే యుంచుట యుక్తమని కొందఱభిప్రాయపడవచ్చును. ఈవాదము “ఘటత్వత్వత్వత్వంకుతోనజాతిః" అనుదానివంటిది. ధారా విశ్రాంతి లేకుంటచే “ఘటత్వమునందే" జాతి నంగీకరించి తక్కిన తుక్కును వదలికొన్నట్లు మొదటిపాఠమునే సమ్మతించుట యుక్తమని కొందఱనవచ్చును. “ప్రథమాతిక్రమణే కారణాభావాత్” అనుటచే “అందు ఒందు” అనుమార్పువఱ కెందులకు శాస్త్రులవా రిక్కడనే శంకింపవచ్చును గదా? శాస్త్రులవారు కల్పించినచర్చ విద్యార్థులకు విద్యాభివర్ధకమనుటకు సందియము లేదు గాని పరినిష్ఠితులును బహుశ్రుతులును అగు శాస్త్రులవారు “కశ్చిత్కాంతా” అనుచోటంబలె, అందు అనుచోట శంకించుటయు దిద్దుకొమ్మనుటయు నంతియుకాక

"సంశయాస్పదము కాదని యెన్నఁటికిని ఋజువు పఱపలేరనియే నా నమ్మకము" "ముమ్మాటికిని సంశయాస్పదమే యగును" `.