పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/493

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

పునఃపేషణము

497


గలవు. ఇందు సామాన్యధర్మమెయ్యది? విశేషధర్మమెయ్యది యనుచో-"కావ్యత్వవ్యాప్యము నాటకత్వము" కాని నాటకత్వవ్యాప్యము కావ్యత్వము కాదు. ఈ యంశము పండిత పామరసాధారణ్యముగాఁ దెలిసినదే కదా? అగుచో నొకవస్తువునందలి వివిధ ధర్మములలో వ్యవహారోపయుక్తమగు ధర్మ మేది కావలయును? వ్యాప్యధర్మము కావలయును? అపుడు నాటకమునందుఁ గావ్యత్వమున్నను దానిని విశిష్టధర్మప్రయుక్తమగు నాటక శబ్దముచేతనే వ్యవహరించుట పండితసమ్మత మగును. గాని సామాన్యధర్మ ప్రయుక్తమగు కావ్యశబ్దముచే వ్యవహరించుట పండితసమ్మతము కాదని యొప్పికొందురా? ఒప్పికొననియట్లు మీరు వ్రాసిన 'రూపకములు కావ్యము లేకదా' లోనగు మీపంక్తులుద్ఘోషించుచున్నప్పుడు మిమ్మ మరల నడుగుట యనాలోచితమే. అగుచో "నాటకమున నాటకత్వకావ్యత్వములేకాక” పదార్థ, త్వ, కార్యత్వ, యక్షరమయత్వాదులు గూడఁ గలవు కదా? తత్తద్ధర్మప్రయుక్తములగు పదార్థ, కార్య, ప్రముఖశబ్దములచేఁ గూడ వ్యవహరించుచున్నారా? వ్యవహరించుట యథాకథంచిత్తుగా సమర్థనీయమే అనుకొందము. లోక మామోదించునా? “యద్యపి శుద్ధం లోకవిరుద్ధం" అనుచొప్పున నట్టివ్యవహారము సర్వథా గర్హితమే యగునా? కాదందురా? అట్లేని స్మార్తులు, శ్రీవైష్ణవులు, మాధ్వులు, ఈ మూఁగురును బ్రాహ్మణులే కదా? ఇందు శ్రీవైష్ణవులకు స్మార్తత్వాపేక్షయావిశిష్టధర్మము వైష్ణవత్వముండుటచే వారు తద్ధర్మప్రయుక్తమగు వైష్ణవపదముచేతనే వ్యవహరింపఁబడుచున్నారు. ఇట్లే "మాధ్వులును" అని విస్పష్టము. ఈ వ్రాసిన వ్రాఁతకెల్ల సారాంశము వ్యాపకధర్మమునకు వ్యాప్యధర్మము బాధక మనునదియే. ఇది సర్వానుభవసిద్ధమగునేని "నాటకములు కావ్యము లైనను" ఆపదవ్యవహారము విశిష్టపదవ్యవహారముచేఁ దిరోహితమగు. కావున సర్వసాధారణముగా నాంధ్రులు కావ్యాదిని శ్రీకారము వాడుచున్నను నాటకాదిని వాడనక్కఱలేదు. గీర్వాణకవుల యాచారముంబట్టి వ్రర్తింపవచ్చును అని తేలుచుండంగా శాస్త్రులవారు శాస్త్ర మర్యాదసర్వత్ర గలదు అని వ్రాయుటేలొకో? పైఁగా “సాధారణులఁ గప్పిపుచ్చనేమో" వ్రాయుదు రేమో, అందురే ? నే నిపుడు గాని, యింతకు ముందుగాని వ్రాసినవ్రాఁత సాధారణులను గప్పిమోసపుచ్చునదియో, పండితసమ్మతమో శాస్త్రులుగారే నిర్ణయింతురని దీని నింతతో నిప్పటికి ముగింతును. ఇక “పాండుతనూభవులందు దుఃఖము" అనుచోనందలి “అందు" అనునది క్రియాజన్య విశేషణమా, విభక్తియా? అని సందేహమునకు నవకాశ ముండునుగాన “అందు, ఒందుగా మార్చుట యొప్ప" అని వాదింప మొదలిడిరి. పోనిండు వీరియభిప్రాయము మొదటినుండియు నిట్టిది యేమో అనుకొన్న మొదట వీరట్టి సందర్భమును సూచింపక యిటీవల నీత్రోవకు దిగినారు. దిగుదురుగాక "సందేహాస్పద మనియే యనుకొందము" వీరు సామాన్యులు కారు బహుశ్రుతులు గదా? “వ్యాఖ్యానతో