పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/488

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

492

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


యీశ్వరుఁడు ప్రష్టవ్యుఁ డనఁదగు. ఈ విషయ మిటులుంచి ఈవిషయమున వీరు నావ్రాసిన యక్షరములు ప్రస్తుతమునేకాక యప్రస్తుతమునుగూడ బోధించుచున్నవని నాయెడలఁ గినియుచున్నందులకు నుపశాంతి కల్పింపవలసియున్నది. ఆస్థలము- ‘భారత ప్రయోగములు శాస్త్రులవారికి చావులుగా మార్చదగినవియే కాఁబోలు" అనునది- ఈ, కి, షష్ఠి కర్తరిషష్ఠి వంటిదిగాని, కర్మణి షష్ఠివంటిది గాదు. లేఖకాశయ మిట్టిదియే యైనను శాస్త్రులవారు వ్యాకరణ నిష్ణాతులగుటచేఁ గాఁబోలు- "ఉభయప్రాప్తౌ కర్మణి" అను నాధారమును నూఁతగాఁగొని పైవాక్యము వ్యక్తికి సంఘటించుచున్నట్లభిప్రాయపడి యేవో కొన్ని పంక్తులు లిఖించినారు. ఆషష్ఠి కర్తృ కర్మ సాధారణముగా నన్వయింప వీ లిచ్చెడిదియే కాని ప్రయోక్త్రభిప్రాయమును సుంత విచారించుకోనక్కరలేదా? “చంద్రవన్ముఖమ్" అనుచోc గవ్యభిప్రేతములగు నంశములనే గైకొందురో? లేక యనభిప్రేతములగు నంశములనుగూడc గైకొందురో? ఇదిగాక ఆ వాక్యము ప్రస్తుతార్ధమును బోధించి యంతతో శాంతినందక శాస్త్రులవారి యపోహ కవకాశము సుంత కలుగుచున్న దనుకొందమా? అగుచో మీవ్యక్తికది సంభవింపఁ జేసెడి దొసంగును దొలఁగించుటకుఁ బరాత్పరునిఁ బ్రార్ధించుచుఁ బ్రతివిమర్శకుల నీయొక్క మాటడుగుచున్నాఁడను. అయ్యాఁ మీకునఃపోహను గల్గించిన విషయమును మాత్రమే లిఖించి, మిన్నకుండక తక్కిన జలతాడనమున కేలకడంగితిరి? ఇప్పుడు నే సమాధాన మిచ్చిన యంశముల నటులుంచి యసారములని పూర్తిగా వదలినవాని యోగ్యతను నానేర్చినకొలందిగఁ జూపుచున్నాఁడను. "కొంపతీఁత" - ఈ ప్రయోగము శాస్త్ర సిద్ధమైనను లోకమున వాఁడుకలో లేనిదిగా భావించి పాయు+త, డాయు+త, దూయు+త, క్రోయు+త, చేచు-పాచు-లోనగు నప్రసిద్ధముల నుదాహరించి యున్నారు. మీ యుదాహరించిన రూపములో దూయు ధాతువునకు లోకమున “దూఁత” అని ప్రయోగము కలదు సుఁడీ. అట్లే మాతీఁతకును వాఁడుక కలదు. ఈక్రింది యుదాహరణముల నరయుఁడు. “గోదావరి తీcత కారంభించినది, కలుపుతీఁత జరుగుచున్నది.” ఇఁక దూఁతకుఁ బ్రయోగమును జూపుదును. ఆయూర దోమలు “దూఁత"లును చరపులును, ఇత్యాదులు లోకప్రసిద్ధములు. మీప్రాంతమున నిట్టివ్యవహారము లేకపోవచ్చును. అందులకే కదా? “దేశాటనమును" నైపుణీ సంపాదక సామగ్రిలో లాక్షణికులు చేర్చినారు “కంగుల్ దీర్చినపైఠిణీరయిక" అనుదానికి సంబంధించిన యితిహాసము తామెఱిఁగియే యుందురు. వ్యాకరణము నిప్పట్ల నడుగనే యక్కఱలేదు కదా? అప్రయుక్తత లోకప్రసిద్ధి వలనఁ దొలఁగెడిని. ఇఁకఁ బూర్వులగ్రంథ ప్రయోగముల నడుగవలెను. ఉన్నను నుండవచ్చును. లేదా యిట్టి లోకప్రసిద్ధములకు వానితోఁ బనియేమి? సజాతీయ ధాతువులు కొన్నిటినుండి యిట్టివి పుట్టినట్లు లేదని దీని కనభిధానము చెప్పుట