పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/487

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పిష్టషేషణము

491


గూడ నిర్ణయించునంతటి శ్రద్ధకలవారు కారన్నందులకు మీ వ్రాఁతలోనివియే కొన్ని యుదాహరించు చున్నాఁడను- “ప్రయోగమును జూపుఁడు, మీరు చూపలేరని ప్రశ్నించుటగాదు, నా యెఱిఁగినంతవట్టు లేదని తోచుచున్నది. నేను సర్వజ్ఞుఁడనా? అల్పాల్పజ్ఞుఁడను." ఈవ్రాఁత కర్ధమేమైనా గలదా? ఇయ్యది- "చంకదుడ్డు శరణార్థి అను సామెత కుదాహరణమో? కాదో? విమర్శించి చూచికొనుఁడు. మీకుఁ దోcచినంతలోఁ బత్రికలు తేరగా నున్నవి కదా? యని ప్రచురించి, వృథాగాఁ బని కల్పింపవలసినదియేనా? మరల నీ క్రింది మీయక్కరములను జదివికొనుఁడు.

"నాప్రశ్నములకు సమాధానమిచ్చుటయే చాలును"

అయ్యా! మీరాయాయి ఘట్టములఁ బూర్వపక్షముల నెత్తికొని యెంత వ్రాయవలయునో యంతయు వ్రాసి తుదకు సాధుత్వము కుదురక “ఈ ప్రయోగ మెట్లును దుష్టమే" ఇత్యాదిగ నిశ్చయించి యిపుడు కొంత వినయమును బ్రకటింప మొదలిడి యా సంభ్రమమున- "దశదాడిమాది వాక్యముంబోలె" పరస్పర సమన్వయము లేనిమాటలను లిఖించుచుఁదుదకయ్యవి యన్నియును ప్రశ్నములుగాని, సిద్ధాంతములు గావని యపలపింపఁ జూచుచున్నారని విచక్షణులగు చదువరులు నిర్ణయించెదరనియేని తలఁపక మరల మీరు పత్రికలోc గొన్ని కాలములు వృథసేయుటకు నేను మిక్కిలిగ వగచుచున్నాను. నిజముగ మీరిన్ని ప్రశ్నలను నన్నుఁగాని యొరులనుగాని యడిగి తెలిసికోవలసిన వారే యగుచోఁజేయవలసిన విధానమిదికాదు సుడీ? "గురు శుశ్రూషయా విద్యా" ఓహో? అది యెట్లు సంఘటించెడిని? పాపము! శాస్త్రులవారికి శిష్యత్వము చేయు కుతూహల మున్నను "ప్రత్యక్షమగుచో నేమగునో" అను భయము పూర్తిగ బాధించుచున్నది. కావున వీరిబ్లే పత్రికలు నింపుచుందురు. ఓపికయున్నచో వీరికి నుత్తరములు లిఖింపవలసినదియే. ఇట్టి వాదోపవాదముల మూలమున విద్య నార్జించు నుపాయము గూడ గణనీయమే కాని, ప్రస్తుతము వారి యుద్యమమునకుఁ దోడ్పడునంతటి యోపిక లేమింజేసి వారు సమీపమునకు వచ్చుచో నెట్లు బోధింపఁబడునో తద్విధానము నెఱింగించుటకుఁగా నేదో యొకదాని నడుగుఁడని విన్నవించుకోవలసి వచ్చినది. నేనెంతయో ధైర్యముతో మాఱుమాట లేఖమును వ్రాయరని వ్రాసిన యంశమునకుఁగూడ శాస్త్రులవా రెంత గంభీరముగా వ్రాయుచున్నారో? "పితృవ్యాదులు శ్రీ శాస్త్రులవారన్నట్లు పాఠకులే నిర్ణయింపవలయును."

ఇంకను "పితృవ్యాదులు" అనుచోఁ దామనుకొన్నయర్థము ఝడితి స్ఫూర్తి నందునని చెప్పఁదగువారు పాఠకులలో నుందురనియే వీరికి విశ్వాసము కాఁబోలును? అగుచో! బ్రస్తుత విషయమున వీరు ప్రష్టవ్యులు కారు. వీరి కట్టి నిశ్చితజ్ఞానమును బ్రసాదించిన