పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/486

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

490



పిష్టషేషణము

అయ్యా! కృష్ణరాయశాస్త్రులవారూ! మిమ్మును నేను- “విధిగా వ్రాయవలసి యుండునెడలనే" అని యభ్యర్థించినట్లు తాము శీర్షికలో నుదాహరించుచుఁ గూడ లిఖించిన సమాధానములయం దొకటిగాకున్న నొకటియైన నిలిచెడి తెగలోనికిఁ జేరకపోవుటయేకాక తత్తత్సందర్భములలోని మాటలే వాని యసారతను దెలుపుచున్నవి పరిశీలించెదరా?

(1) రూపక కావ్యాదిని శ్రీకార ముండవలయునని లేకున్నను,

(2) సంశయాస్పదమనియే విన్నవించితిని.

(3) అనువాcడనో కానో శ్రీవారే యెఱుంగుదురు.

(4) మాకు లోపహేతు వక్కఱలేదు.

(5) ఇయ్యది రుచిభేదము ననుసరించినది.

(6) తప్పని నిరూపింతునని నాయభిప్రాయము గాదు.

(7) పాండురంగ మాహాత్మ్యమున ... ... ప్రయోగ మున్నదని యెఱుంగుదును. పాఠాంతరములున్నవియో యెఱుంగను.

(8) ప్రయోగము లభించునా యనియే సంశయించితిని.

(9) వ్యాకరణశాస్త్ర ప్రకారము కొన్ని సిద్ధములైనను,

(10) ప్రయోగ బాహుళ్యము కావలయును.

ఆ యీ మాటలును, వీనికి సందర్భించినమాటలును సవిమర్శముగా మరలఁ జదివికొని మీరు వాడినవాక్యములలో, లేక పదములలో, నేదినిల్చునని మీకుఁ బూర్తిగా విశ్వాసముండునో యట్టిదాని నొకదాని నేరి చూపితిరా? దానికై యెంతవ్రాయవలయునో యంతయు వ్రాసి, మీ యొనర్చిన పరిశ్రమకు సార్థక్యము గల్పింప యత్నింతును. అంతియ కాని యేవో కొన్ని కాలములను దోఁచినట్లుమీరు-"ప్రతివిమర్శనము" అని నింపుచుంటిరా? “అడిగెడివానికిఁ జెప్పెడివాఁడు లోఁకువ కనుక విస్తారముగాఁ బెంచి వ్రాయవలసివచ్చును. అందులకుం దగినంతయోపిక లేదని మున్నే విన్నవించికొంటిని గదా? మీరు పరులవ్రాఁతలోని సారాసారములటులుండ స్వీయమగు వ్రాఁతలోని సారాసారములను