పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/484

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

488

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


నెల్లరనియుఁ గలదఁట? సమ్మతింపరానిదఁట?” ఎందుల కీ పిచ్చివ్రాఁత. ఇట్టివే మఱికొన్ని యక్కరము లిచ్చోగలవు. ఇది యంతయు స్వవచో వ్యాఘాతపు వ్రాఁత, “ఉ. ఎల్లరు నెల్లచో ధనములిచ్చి" అని తెనాలి రామకృష్ణకవి ప్రయోగించెను. మఱియు నీక్రింది యాక్షేపణమును జూచినచో శాస్త్రులవారి సహృదయత్వపు బండారమెల్ల నొక్కమాఱుగా బట్టబయలగును.

"పితృవ్యాదులు" పితృవ్య ప్రభృతులన్న బాగఁట? "పై ప్రయోగము సరియైనను వినఁగనే నా చెవికి పితృవ్యులను తినువా రను నర్థము స్ఫురించెను" అని వ్రాయఁగలిగిరి. వీరిట్లు వ్రాయుట తప్పులేదు. వీరి వ్రాఁత సర్వము నిట్టిదియేకదా? వీరి చెవికెట్లు స్ఫురించెడినో మాకెట్లు గోచరించెడిని? మా యనుభవముంబట్టి వీరికి స్ఫురించిన యర్ధము ఝడితి స్ఫూర్తినందెడిది కాదనియుఁ గష్టముమీఁద స్ఫురించెడిది యనియు- "పినతండ్రులు మొదలగువారు" అనునది శీఘ్రోపస్థితమగుటకుం గల హేతువు విచారణీయము. అందులకు మాకున్న పాండిత్యము చాలదు. వైద్యశాస్త్ర పాండిత్యము కావలసియున్నది. వీరి ధర్మమాయని పాపము, "నాచెవికి" అని వ్రాసినందులకు సంతసింపవలసియున్నది. ఈవిరుద్ధపుఁ జెవికి "సీతారామౌ" అనుదానికి లాంగలపద్ధతియు, గంధర్వమృగమును, ఝడితి స్ఫూర్తి నందవలసియున్నది. శాస్త్రులవారు త్వరలో జాగ్రత్త గలిగి యీవిరుద్ధజ్ఞానము నుపసంహరించుకొనుటకై ప్రయత్నింపఁగోరఁబడుచున్నారు. ఏకారణముననో శబ్దవిషయమైన చర్చలో వీరి విచార మసారముగా నున్నను ఆర్థిక విచారమునెడల మిక్కిలి చక్కఁగ నున్నదని వ్రాయఁగలను. దానింగూర్చి విస్తరించి వ్రాసిరి. కొన్నిచోట్ల మిక్కిలిగ మెచ్చుకొనిరి. కొన్నిచోట్ల “ఛాందసత్వము" నారోపించిరి. సహృదయైక శరణ్యమగు ప్రస్తుత సందర్భమున నేనేమివ్రాసినను బ్రయోజనముండదు. కవియనఁగా? వంట బ్రాహ్మణుని వంటివాఁడు. వానిపాకమునందుం బలెవీని పాకమునందును భిన్నాభిప్రాయము లుండెడిని.

"జిహ్వకొక రుచి, పుఱ్ఱెకొక గుణము" అనులోకోక్తి నెఱుఁగని వారెవరు? పాచకుఁడుగాని, కవిగాని తన పాకమును గూర్చి వివరింపరాదు. “సహృదయాః ప్రమాణమ్.”

“శ్లో. కవిఃకరోతికావ్యాని | లాలయత్యుత్తమోజనః
     తరుఃప్రసూతే పుష్పాణి I మరుద్వహతి సౌరభమ్"

గేస్తు సంతతిం గన్నట్టులు కవి యేవో గిల్కుచుండును. అందుఁ గొన్ని కొందఱకు మఱికొన్ని కొందఱకు నచ్చుచుండును. కొందఱకు నచ్చినవి కొందఱకు నచ్చవు. ఇందులకుఁ గవియేమి చేయఁగలఁడు? కవి రసాస్పదమనుకొన్న యొక పద్యము విమర్శకుని