పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/483

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పాండవాశ్వమేధము

487


సమాస గతమే యందురోటు? అనరు. వారనుకొన్న సమాస మిట్టిదికాదు. ఇట్టిదే యని వాదమునకు దిగినప్పుడు సమాధానమీయవచ్చును గదా? పైఁగా “జనుఁడను ప్రయోగము చక్కఁగ నభ్యస్తము కాలేదని ప్రత్యాంధ్రుడును నెఱుఁగును". అని యొక క్రొత్తమాట వ్రాసియున్నారు. అభ్యస్తముకాని యంతనే కబ్బముల వాడఁగూడదేమి? 'ఒగి, ఏడైటి, వ్రేల్మిడి, నెట్టపంట, తద్దయు, ఎసక మెసఁగ" ఈ గ్రాంథిక పదములన్నియుఁ బ్రత్యాంధ్రునకును నభ్యస్తములే యగు నోటు? ఇవి దేశ్యములు. నా వ్రాఁత తత్సమమునకు సంబంధించినది యందురో? అనుఁడు. ఆగుచో "క ...సద్యంబ బ్రహ్మహత్యా పద్యము" భారతస్వర్గా 1, ఆ పైపద్యములోని "సద్యము" ప్రత్యాంధ్రునకును నభ్యస్తమే యగునొకో? తలయుం దోఁకయు లేని యిట్టి వ్రాఁతలవలన ఫలమేమి? శాస్త్రులుగారూ! మఱియు “ప్రప్రథమము” ఈ ప్రయోగము సాధువా? యనిరి. అంతతోఁజాలింపక “ఇదియే యామ్రేడితమో" అనికూడ వ్రాసిరి. వీరితో నిది యామ్రేడితమని చెప్పిన మూర్జుఁడెవఁడో కదా? పైఁగా “గీర్వాణమునఁగాని యాంధ్రమునఁగాని యిట్టి ప్రయోగములేదు” అని ధ్రువపరచిరి.

ఈ విమర్శకులకు నాందిలోని రసవిషయికమగు చర్చంబట్టిచూడఁ బదచ్ఛేదమెట్లు చేసికోవలయునోకూడఁ జక్కగఁ దెలియదని స్ఫుటమగుచున్నది. అట్టివారికీ వృథా సాహసోక్తులేటికో? ఇట్టి ప్రయోగము లేదఁట? లేకపోవుcగాక, అది దుష్టమైనపుడు కదా? “వైయాకరణాః పిశాచాః ప్రయోగమంత్రేణ నివారణీయాః" అను చొప్పున వాకట్టు కల్పించుటకుఁ బ్రయోగపర్యంతానుధావనము చేయవలయును. శాస్త్రులవారు దానిదుష్టత్వమును నిరూపింప వలసియున్నది. అప్పుడు దానిశిష్టత్వమును నిరూపింతుము. ప్రయోగమఁట! రామశబ్దమునకుఁగూడ వీరికిఁ బ్రయోగమే కావలెను గాఁబోలును. మఱియు “వృథామాట” ఈ సమాస మనేక మందిలోనిది యఁట! ప్రయోగింపరాcదట! ఎంత చక్కని విమర్శనము! ఇది సమాస మేల కావలయునో? వ్యస్తమన్నచో శాస్త్రులవారి శంక నివృత్తము కావలసినదే కదా? కాదు. "సమాసమే యందము" అనుచో వీరు దీని నేమిచేయఁగలరో? “అనేకమంది” తరగతిలో నిది చేరదు. చేరదు, చేరదు, కారణమరయుదురుగాక. తెలియదన్నచోఁ దెలుపcబడును. మఱియు, "కోసము" ఇది యెవరి సహవాసము వలననో కల్గినదఁట! "గ్రాంథికముగ నటనట నున్నను" నగ్రాహ్యమఁట. ఇదియేటివ్రాఁత? ఇఁక గ్రాంథిక ప్రయోగమిచ్చి యేమి ఫలము! లోకార్థ మీఁబడుఁగాక. ఉ.భూసుత కోసమే గనుక బొంకితినేని. ఉ|| రా|| రా|| అ|| మఱియు "ఎల్లరు" ఎల్లవారనియే యెల్లకావ్యముల గలదఁట. ఏమి వీరి సాహసము! ఎల్లకావ్యము లనఁగా? అచ్చులును, హల్లులును, మాత్రము కావు గదా? “కొన్నిటఁగ్వాచిత్కముగ