పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/473

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యింకో అపవాద

477


చేసినట్లవుతూవుంది. ఆయన తప్పులతో మన కవసరమేమిటి- అని వుపేక్షిద్దామంటే : లోకోత్తర కవీశ్వరుఁడైన పూర్వమహాకవిని తి. వెం. కవులు వెక్కిరించారంటూ వక తప్పుడుమాట దీనిలో కనబడుతూవుంది. మొదట వెం. శా. గారిని గూర్చి ఆ తప్పుడు సామెతను తారతమ్యజ్ఞానవైధుర్యంచేత “కుర్వీత బుధ సోమయోః” అన్నట్టుగా వాడి, ఆ విషయం వెం. శా. తెల్పితే తెలుసుకొని దాన్నే సమర్థించుకోవడానికి యీయన పడే బాధను చూస్తే యెవరికేనా చాలా విచారం కలుగుతుంది కాని- పైఁగా యిప్పుడు తొక్కే తప్పుడుతోవకు. అనఁగా “అబ్బాయీ! కొబ్బరిచెట్టెందు కెక్కేవంటే, దూడ గడ్డికి" అనేవాని మాదిరికి దిగి, పింగళి సూరన్నగారిని "వెక్కిరించారు కనుక తి. వెం. కవులు- వారిని నేను వెక్కిరించడానికి చూస్తే కోపంకూడా వచ్చితీరుతుందనుకుంటాను. యీ వెక్కిరింపును యీ విమర్శకుఁడుగారు తి. వెం. కవుల తాలూకు యే మాటల వల్ల గ్రహించారో ఆ మాటలుకూడా వుదాహరించడం ప్రస్తుతం కాకపోదు. కావున వుదాహరిస్తాను,

"సంగీతసాహిత్యంబులు నేర్చితి. వ్యాకరణంబుఁ జదివితి. లక్ష్య లక్షణ చాకచక్యంబునం దద్వితీయ ననిపించుకొంటి. ఆశుకవిత్వమల్లుటభ్యసించితి. కొన్ని కావ్యంబులు, నాటకమ్ములు వ్రాసితి. సరస్వతియే బాలసరస్వతి యను బిరుదొసంగి యీగండపెండేరంబు కాలికిం దొడిగె. రాజరాజేశ్వరీషోడశీమహావిద్య నభ్యసించితి. శతవధానముచే... కలధౌత బిరుదమాన్యత గంటిన్”. ... "

తి. వెం. కవులు శుచిముఖిపాత్రచే వారి నాటకమునఁ జెప్పించిన మాటలు చిత్తగించండి. యీ మాటలలో వాచ్యంగాఁగాని, వ్యంగ్యంగాఁ గాని పింగళి సూరన్నగారిని వెక్కిరించడం యేలా వస్తుందో ఆలోచించండి. అయితే విమర్శకునకు మాత్రం యీ అంశం తెలియదా అంటారా? అట్లనఁగలమా? మనుష్యమాత్రునకు తెలిసేవిషయంగదా యిది. పైఁగా ఆయన పండితుఁడాయె. తెలియదనుకోవడం యేలాగ? తెలుసునుపాపం! చిక్కులో పడివుండడంచేత వూఁపిరి తిరగక యిదోతోవ తొక్కినట్లు తోస్తుంది. పోనీ ఆయన ఆత్మసంరక్షణకు పడేపాట్లతో మనకేంపని అంటే మనమీద అపవాద అంటగట్టటం వకటి వచ్చిపడిందిగా! మన సంరక్షణ కొఱకు ఆయన చేసిన తప్పును బయటఁబెట్టవలసి వచ్చింది. అందుచే షెద్ద చిక్కువుండిన ఆయనను గూర్చి యీ కాస్తా వ్రాసి లోకులకు సత్యం తెలిపినందుకు ఆయన్ని క్షమాపణ వేడకతప్పదు.

ఆయనకేవో చాల సందేహాలు మా నాటకంలో వున్నట్లు వ్రాశారాయన. వుండవచ్చు. అవి తీర్చడానికి నాకు వోపికలేదు. అక్కడకీ కొంత వోపిక తెచ్చుకొని మూడు వ్యాసాలు కాఁబోలును విస్తరించే వ్రాసి తెలిపివున్నాను. అవేవిన్నీ తన సందేహాన్ని పోఁగొట్టనట్లే