పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/471

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

475



యింకో అపవాద

వక అపవాదనిగూర్చి ప్రౌఢభారతిలో వ్రాసివున్నాను. మఱో అపవాదనుగూర్చి కృష్ణకే పంపియున్నాను. యింతట్లో భారతిలో వకాయన యింకో అపవాదను ఆరోపించాడు. యీ అపవాదకున్నూ, ఇదివఱలో మొల్లకు సంబంధించిన అపవాదకున్నూ, ఆరోపించినవారికి స్వార్థపరత్వం యెక్కువగా వున్నట్లు తోస్తుంది. గతం దానికి వ్రాసేవున్నాను. దీనికిక్కడ వ్రాస్తాను.

వకాయన మానాటకాన్ని ఆక్షేపిస్తూ యేవో కొన్నిమాటలు వ్రాస్తూ అందులో ప్రసక్తానుప్రసక్తంగా, వెం. శా. గారు "వెక్కిరింపఁబోయి బోల్తాపడ్డా"రని వ్రాశారు. ఆవ్రాఁత చూచి నేను జవాబువ్రాస్తూ, యీ లోకోక్తివాడడానికి లేశమున్నూ అవకాశంలేదు. యిది “కుర్వీత బుధసోమయో" అన్నరీతిగా వుందంటూ వ్రాసి విమర్శకుఁడుగారి స్థితి చాలా “లోయర్" క్లాసులో వుంది అనే అర్థమిచ్చేమాటలు వ్రాసివున్నాను. అది చూచుకునేటప్పటికి ఆయనక్కూడా తానుచేసిన ప్రమాదం గోచరించి- తక్కిన వ్రాతంతా వకవంతున్నూ పనిలేనిపాటగా వయోమాత్రం చేతనేనా పెద్దవాఁడైన వెం. శా. ని వెక్కిరింపఁబోయి బోల్తాపడ్డాడనడం వకవంతుగా వుండడంచేత, దీన్ని మనం సమర్థించడం యెట్లాగా అని అందోళన కలిగింది పాపం! దానిమీఁద వకపెద్దయెత్తు యెత్తేరాయన. మొట్టమొదట బోల్తాపడ్డారన్నది వెం. శా, ని మాత్రమే. ఆ తప్పును సవరించుకోవడానికి యిప్పడీలా అనడమేమి? అనేశంక వారికితోఁచివుండదను కుంటాను. లేదా? తి. వెం. కవులకుఁగల అభేదాన్ని వెం. శా. గారీమధ్య ప్రకటించిన వ్యాసంలో చదివినతర్వాత వ్రాసే వ్రాఁఁత కనక, ఆరీతిచే సమర్థించుకుందామనే అనుకున్నారో! దానికేమి? ప్రాజ్ఞలోకం కొఱకు ఆయీ అపవాదస్వరూపాన్ని తెలపడం ఆవశ్యక మవడంచేత. ఆయన వ్రాసిన యితరసందేహాల జాపితాను స్పృశింపక, యిది మహాకవి పింగళి సూరన్న గారికి సంబంధించినదవడంచేత, వోపిక లేకపోయినా కొన్ని మాటలు వ్రాయడం తప్పక వ్రాస్తూ వున్నాను.

“తి. వేం. కవులు ప్రభావతీప్రద్యుమ్న నాటకంలో పింగళి సూరన్నగారిని వెక్కిరింపఁబోయినారు" అని నిన్న నేడు భారతిలో మొదటి దాన్ని సమర్థించుకోవడానికి