పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/470

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

474

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


చ. “పరమగురూపదేశమునఁ బార్థుడు పార్థివరత్న శేఖరుం
    డరిదిబలమ్మునన్ భుజబలాతిశయమ్మున నీశుఁ బన్నగా
    భరణుఁ బ్రసన్నుఁ జేసి దయఁ బాశుపతాదికదివ్యబాణముల్
    హరసుర రాజదేవనివహమ్ములచేఁ బడసెన్ గ్రమమ్మునన్."

ఇట్టి చొప్పదంటుశంకలు నేఁడే మాకుఁ దటస్థింపలేదు. విద్యార్థి దశ నాఁటినుండియు నెవరో చేయుటయు, నుత్తరమిచ్చుటయుఁ గలదని చదువరు లెఱుఁగనిదికాదు. విద్యార్థిదశలో మాతోఁ జదివికొను నొకరు.

శ్లో. "పశుపతిదయితాతృతీయపత్రౌ ! తిరుపతి వేంకటశాస్త్రిణౌ ..."

అను ధాతురత్నాకరశ్లోకములో మీ కిరువురకును తృతీయపుత్రత్వ మెట్లు సిద్ధించునని శంకింపఁదొడఁగిరి. దానింగూర్చి చెప్పినసమాధాన మిపుడు ప్రస్తుతము గామింజేసి యిటనుదాహరింపక ప్రస్తుతపుశంకకును దానికిని గొండొక పోలిక యుంటచే స్పృశించి విడుచుచున్నాను.

సీ. “ఏమహాత్ములు గల్గ భూమీశసభలలోఁ
               గవులకు బహుళవిఖ్యాతి గల్గె"

అది యటులుంతము. ఇఁక నొకటి మఱచితి. ఈనావ్రాసిన వ్రాఁత గూడ తిరుపతి వేంకటీయ మనియే ముందు సంపుటములలోఁ బ్రకటితమగును. అది విమర్శకునకు సమయము ననుసరింపనిచో నెట్లు సమన్వయించునో? "శాంతం పాపమ్",


★ ★ ★